News April 18, 2024
బుచ్చియ్యపేట: ఎన్నికల అధికారుల పేరిట దోపిడి

ఎన్నికల అధికారులమంటూ నమ్మించి వాహన తనిఖీల పేరుతో మంగళాపురం మాజీ సర్పంచ్ అల్లంకి వెంకటప్పారావు నుంచి గుర్తు తెలియని వ్యక్తులు బంగారం దోచుకున్నారు. అల్లంకి బుధవారం స్కూటీపై వెళుతుండగా, విజయరామరాజుపేట దాటాక ఇద్దరు బైకుపై వచ్చి అడ్డగించి బ్యాగు తీసుకుని తనిఖీ చేశారు. ఆయన ధరించిన బంగారు చైన్, ఉంగరాలు, బ్రాస్లైట్ తీసి బ్యాగులో వేస్తున్నట్లు వేసి వారి జేబులో వేసుకొని అక్కడ్నుంచి వెళ్లిపోయారు.
Similar News
News December 11, 2025
విశాఖ వేదికగా పెన్షన్ అదాలత్

విశాఖపట్నంలో డిసెంబర్ 19న ‘పెన్షన్ అదాలత్’ కార్యక్రమం జరగనుంది. సిరిపురం వుడా చిల్డ్రన్స్ థియేటర్లో జరిగే ఈ సదస్సుకు ఏపీ ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ శ్రీమతి ఎస్.శాంతి ప్రియ హాజరవుతారు. పెన్షనర్ల సమస్యల పరిష్కారం, డీడీవోలకు సరైన మార్గనిర్దేశం చేయడం దీని ప్రధాన ఉద్దేశం. ఉద్యోగులు, పెన్షనర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు.
News December 11, 2025
సింహాచలంలో నెల గంట ముహూర్తం ఎప్పుడంటే ?

సింహాచలం శ్రీవరాహ లక్ష్మీ నృసింహ స్వామివారి సన్నిధిలో నెలగంట ఉత్సవాన్ని ఈనెల 16వ తేదీ మధ్యాహ్నం 1:01 గంటకు శాస్త్రోక్తంగా ప్రారంభించనున్నట్లు ఆలయ వైదిక సభ్యులు తెలిపారు. ఈ ధనుర్మాసంలో ఆలయంలో 10 రోజులు పగల్ పత్తు, మరో 10 రోజులు రాపత్తు ఉత్సవాలు జరుగుతాయని చెప్పారు. మరో ఐదు రోజులు దారోత్సవాలు, ధనుర్మాసం సందర్భంగా నెలరోజులు తిరుప్పావై పాశురాల పఠనం నిర్వహిస్తారు.
News December 11, 2025
విశాఖకు గూగుల్.. శంకుస్థాపన ఎప్పుడంటే?

విశాఖ ప్రజలకు మంత్రి నారా లోకేశ్ గుడ్ న్యూస్ చెప్పారు. మార్చిలో గూగుల్ డేటా సెంటర్కు శంకుస్థాపన చేస్తామని ప్రకటించారు. మరోవైపు విశాఖలోని ఐటీ హిల్స్పై 7ఐటీ కంపెనీలకు శుక్రవారం భూమిపూజ జరగనుంది. ఉదయం 11.30 గంటలకు నిర్వహించే కాగ్నిజెంట్ పూజలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. ఈ మేరకు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఏర్పాట్లు చేస్తున్నారు.


