News July 30, 2024
బుచ్చి: జొన్నవాడ ఆలయ ఈవోలు సస్పెండ్
బుచ్చిరెడ్డిపాలెం జొన్నవాడ శ్రీ మల్లికార్జునస్వామి కామాక్షితాయి దేవస్థానంలో నిధుల దుర్వినియోగంపై అధికారులు విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. దీంతో అధికారులు ఎట్టకేలకు చర్యలు తీసుకున్నారు. గతంలో ఈఓలుగా పనిచేసిన గిరి కృష్ణ, వెంకటేశ్వర్లును సస్పెండ్ చేసినట్లు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు. సమాచారం లేకుండా హెడ్ క్వార్టర్స్‌ను వదిలి వెళ్లకూడదని ఆదేశించారు.
Similar News
News December 11, 2024
రాజముద్రలతో నూతన పాస్ పుస్తకాలు: మంత్రి ఆనం
జగన్ బొమ్మలు తొలగించి రాష్ట్ర ప్రభుత్వ రాజముద్రలతో రైతులకు పాస్ పుస్తకాలు అందజేస్తున్నట్లు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన ఆత్మకూరు నియోజకవర్గంలోని పొంగూరు, నాగులపాడు రెవెన్యూ సదస్సులో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ..పాస్ పుస్తకలపై జగన్ ఫోటోను తొలగించి రాజముద్రలతో ముద్రితమవుతాయని, భూ సమస్యలను పరిష్కరించి, రైతులకు పూర్తి హక్కులు కల్పించడమే రెవెన్యూ సదస్సుల లక్ష్యమని తెలిపారు.
News December 10, 2024
గూడూరు: తల్లికి సాయం చేస్తానని లోకేశ్ హామీ
గూడూరు నియోజకవర్గం చిల్లకూరు మండలం కలవకొండకు చెందిన మోహిందర్ తల్లి అనారోగ్యానికి గుర్యారు. నెల్లూరులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యశ్రీ, సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆదుకోవాలని మోహిందర్ సోషల్ మీడియాలో మంత్రి నారా లోకేశ్‌కు విజ్ఞప్తి చేశారు. దీనికి నారా లోకేశ్ స్పందించారు. తన టీం చూసుకుంటుందని.. సాధ్యమైనంత వరకు సాయం చేస్తానని లోకేశ్ రిప్లే ఇఛ్చారు.
News December 10, 2024
తిరుపతిలో రైల్వే డివిజన్ ఏర్పాటు చేయండి: ఎంపీ
తిరుపతి కేంద్రంగా బాలాజీ రైల్వే డివిజన్‌ను ఏర్పాటు చేయాలని ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్ శీతాకాలం సమావేశాల్లో భాగంగా జీరో అవర్‌లో మంగళవారం తిరుపతి ఎంపీ ఈ అంశాన్ని లేవనెత్తారు. పార్లమెంటులో ఆయన మాట్లాడుతూ..ప్రసిద్ధ ఆధ్మాత్మిక క్షేత్రమైన తిరుపతి విశిష్టతలను వివరిస్తూ రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.