News January 22, 2025

బుచ్చి మండలంలో అమానుష ఘటన

image

ఓ కసాయి తండ్రి తన బిడ్డలను అమ్ముకున్న ఘటన బుచ్చి(M) మినగల్లులో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికుల వివరాల మేరకు.. పేడూరు రవి, వెంకమ్మ దంపతులకు ఇద్దరు మగపిల్లలు ఒక ఆడపిల్ల. మొదటగా పుట్టిన మగ బిడ్డను ఐదేళ్ల క్రితం లక్ష రూపాయలకు అమ్మేశారు. రెండు రోజుల క్రితం మరో మగ బిడ్డను రవి హైదరాబాద్‌కు తీసుకెళ్లి అమ్మాడని వెంకమ్మ తెలిపింది. దీంతో సర్పంచ్ పూజిత ఎంపీడీవో శ్రీహరికి ఫిర్యాదు చేశారు.

Similar News

News March 2, 2026

నెల్లూరులో ‘ఆపరేషన్ చిన్నారి తల్లి’

image

నెల్లూరు ఎస్పీ డా. అజిత వేజెండ్ల ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా ‘ఆపరేషన్ చిన్నారి తల్లి’ కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది. పిల్లలపై లైంగిక నేరాల నిరోధం, బాల్య వివాహాల నిర్మూలన, పోక్సో చట్టంపై శక్తి బృందాలు పాఠశాలల్లో అవగాహన కల్పిస్తున్నాయి. అసాంఘిక శక్తులపై నిఘా పెంచుతూ.. పిల్లల రక్షణ కోసం డయల్ 100, 1098 సేవలను వినియోగించుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.

News March 2, 2026

నెల్లూరు: నర్సింగ్ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

image

బీఎస్సీ నర్సింగ్, బీపీటీ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు నెల్లూరు నర్సింగ్ హోమ్ కరస్పాండెంట్ ప్రభుదాసు ఓ ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు NEET-UG పరీక్షకు హాజరై ఉంటే సరిపోతుందన్నారు. మార్చి 8వ తేదీ లోపు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలని సూచించారు. సందేహాలు ఉంటే తమ కాలేజీని సంప్రదించాలన్నారు.

News March 2, 2026

నెల్లూరు కిమ్స్‌కు 9మంది చిన్నారుల తరలింపు

image

నెల్లూరు జిల్లా ప్రసూతి, చిన్న పిల్లల ఆసుపత్రిలో జరిగిన అగ్నిప్రమాదంపై కలెక్టర్ హిమాన్షు శుక్లా స్పందించారు. 9మంది చిన్నారులను కిమ్స్ ఆసుపత్రికి తరలించినట్లు ప్రకటించారు. ఆ ఏరియాలో ఎలాంటి కాంటామినేషన్ లేకుండా చర్యలు తీసుకువాలని ఆదేశించారు. తిరుపతి నుంచి ఫోరెన్సిక్ టీంను పిలిపించి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టాలని సూచించారు. ఆయన వెంట ఎస్పీ అజిత వేజెండ్ల ఉన్నారు.