News January 23, 2025
బుట్టాయిగూడెం ఘటనపై ప్రెస్ నోట్ రిలీజ్ చేసిన ఎంపీడీవో

కన్నాయిగూడెం మండలం బుట్టాయిగూడెం గ్రామసభలో గురువారం జరిగిన ఘటనపై మండల ఎంపీడీవో ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో పేరు లేదని పురుగుల మందు తాగి ఆత్మహత్యానికి ప్రయత్నించిన కుమ్మరి నాగయ్య వ్యవసాయ భూమి ఉందని, భార్య శాంత అంగన్వాడి టీచర్‌గా విధులు నిర్వహిస్తుందని తెలిపారు. మరోసారి దరఖాస్తు చేసుకోవాలని నాగయ్యకు సూచించిన ముందస్తు ప్రణాళిక ప్రకారం తన వెంట పురుగుమందు తెచ్చుకున్నారన్నారు.
Similar News
News November 26, 2025
మెదక్: ఎన్నికలకు అధికార యంత్రాంగం సిద్ధం: కలెక్టర్

మెదక్ జిల్లాలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. పాపన్నపేట, టేక్మాల్ ఎంపీపీ కార్యాలయాల్లో నామినేషన్ ఏర్పాట్లను బుధవారం పరిశీలించారు. మొదటి విడతలో 160 గ్రామపంచాయతీలో 142 వార్డు ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. 27న ఉదయం ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించి గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఉంచాలన్నారు.
News November 26, 2025
జిల్లా అధ్యక్షురాలికి మంత్రి, ఎంపీ అభినందనలు

భద్రాద్రి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్నకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీ రామ సహాయం రఘురామరెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమెను శాలువాతో సత్కరించి, పార్టీ బలోపేతం, గ్రామ స్థాయి నుంచి చైతన్య కార్యక్రమాలు నిర్వహించే అంశాలపై పలు సూచనలు చేశారు.
News November 26, 2025
సిరిసిల్ల: ఘోర ప్రమాదం.. భర్త మృతి, భార్య పరిస్థితి విషమం

వేములవాడ అర్బన్ మండలం సంకేపల్లి-ఆరేపల్లి గ్రామాల మధ్య బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో భర్త మృతి చెందగా భార్య పరిస్థితి విషమంగా ఉంది. కరీంనగర్‌కు చెందిన వసీం-అయిఫా దంపతులు తమ రెండేళ్ల పాపతో కలిసి ద్విచక్ర వాహనంపై సిరిసిల్ల వైపు వస్తుండగా లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో వసీం అక్కడికక్కడే మృతిచెందాడు. అయిఫా, పాపకు తీవ్ర గాయాలు కావడంతో వారిని కరీంనగర్‌కు తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


