News January 23, 2025

బుట్టాయిగూడెం ఘటనపై ప్రెస్ నోట్ రిలీజ్ చేసిన ఎంపీడీవో

image

కన్నాయిగూడెం మండలం బుట్టాయిగూడెం గ్రామసభలో గురువారం జరిగిన ఘటనపై మండల ఎంపీడీవో ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో పేరు లేదని పురుగుల మందు తాగి ఆత్మహత్యానికి ప్రయత్నించిన కుమ్మరి నాగయ్య వ్యవసాయ భూమి ఉందని, భార్య శాంత అంగన్వాడి టీచర్‌గా విధులు నిర్వహిస్తుందని తెలిపారు. మరోసారి దరఖాస్తు చేసుకోవాలని నాగయ్యకు సూచించిన ముందస్తు ప్రణాళిక ప్రకారం తన వెంట పురుగుమందు తెచ్చుకున్నారన్నారు.

Similar News

News February 9, 2025

శ్రీకాకుళం: తాను చనిపోతూ చూపునిచ్చాడు

image

శ్రీకాకుళం పట్టణం బ్యాంకర్స్ కాలనీలో నివాసం ఉంటున్న బురిడి ముఖలింగం (75) శనివారం మృతి చెందారు. అతని నేత్రాలను దానం చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించుకుని రెడ్ క్రాస్ సొసైటీ ఛైర్మన్ జగన్మోహన్ రావుకు తెలిపారు. మగటపల్లి కళ్యాణ్ నేత్ర సేకరణ కేంద్రానికి చెందిన ఐ టెక్నీషియన్ సుజాత, జగదీశ్, పవన్ అతని కార్నియాలు సేకరించారు. విశాఖపట్నం ఎల్.వి నేత్ర సేకరణ కేంద్రానికి అందజేశారు.

News February 9, 2025

అమెరికాలో ఖమ్మం జిల్లా యువకుడి సూసైడ్

image

అమెరికా న్యూయార్క్‌లో ఖమ్మం జిల్లా యువకుడు తుమ్మేటి సాయి కుమార్ రెడ్డి సూసైడ్ చేసుకున్నారు. చదువుకుంటూ, పార్ట్ టైం ఉద్యోగం చేస్తున్న సాయి కుమార్ ఆఫీసులోనే పాస్ పోర్టు వదిలేసినట్లు సమాచారం. అకాల మృతితో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అతడి మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

News February 9, 2025

పార్వతీపురం మన్యం జిల్లాలో 60 దరఖాస్తులు

image

పార్వతీపురం మన్యం జిల్లా వ్యాప్తంగా కల్లు గీత కార్మికులకు కేటాయించిన రిజర్వుడ్ మద్యం షాపులకు 60 దరఖాస్తులు వచ్చినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ సూపరింటెండెంట్ శ్రీనాథుడు తెలిపారు. మద్యం షాపులకు దరఖాస్తు చేసుకునేందుకు శనివారంతో గడువు ముగిసిందని పేర్కొన్నారు. ఈనెల 10వ తేదీ ఉదయం 9 గంటలకు పార్వతీపురం కలెక్టరేట్‌లో లాటరీ ద్వారా షాపులు కేటాయించనున్నట్లు వెల్లడించారు.

error: Content is protected !!