News February 1, 2025
బుట్టాయిగూడెం: విషాదం.. తల్లీబిడ్డ మృతి

అల్లూరి జిల్లాకు చెందిన గర్భిణి మధుబాల (23) బుట్టాయిగూడెం మండలంలో నివాసం ఉంటుంది. గురువారం ఆమెకు పురిటి నొప్పులు రావడంతో ఏలూరు ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యుల సూచనతో మెరుగైన చికిత్స నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శుక్రవారం తెల్లవారుజామున మృత శిశువుకు వైద్యులు పురుడు పోశారు. కాసేపటికి ఆ తల్లి కుడా మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యంతోనే చనిపోయిందని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు.
Similar News
News December 8, 2025
GHMCలో వార్డుల సంఖ్య రెట్టింపు

TG: GHMCలో వార్డుల సంఖ్యను 150 నుంచి 300కు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. గ్రేటర్ హైదరాబాద్లో 7 కార్పొరేషన్లు, 20 మున్సిపాలిటీలను ఇటీవల విలీనం చేసిన విషయం తెలిసిందే. దీంతో వార్డుల సంఖ్య డబుల్ అయ్యింది. ఈ విస్తరణతో 2,735 చదరపు కి.మీతో దేశంలోనే అతిపెద్ద నగరంగా హైదరాబాద్ అవతరించనుంది.
News December 8, 2025
NGKL: ఎన్నికల భద్రతా ఏర్పాట్లపై డీఐజీ సమీక్ష

నాగర్కర్నూల్ జిల్లాలో పంచాయతీ ఎన్నికల భద్రతా చర్యలను జోగులాంబ జోన్ డీఐజీ ఎల్.ఎస్. చౌహాన్ సమీక్షించారు. ఎస్పీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో పోలింగ్ రోజున ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సోషల్ మీడియా అపోహలపై కఠిన చర్యలు, సమస్యాత్మక బూత్లపై ప్రత్యేక నిఘా కొనసాగించాలని సూచించారు. ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ పాల్గొన్నారు.
News December 8, 2025
4వ రోజు అమరావతిలో పర్యటించిన ప్రపంచ బ్యాంక్ బృందం

అమరావతి రాజధాని ప్రాంతంలో గత మూడు రోజులుగా EB&ADB బృందం పర్యటిస్తున్నారు. 4వ రోజు నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంతంలో ట్రాఫిక్ స్లో నిర్వహణ, రహదారులు BRT ప్రణాళిక తదితర అంశాలపై క్షేత్రస్థాయిలో అమలు కావాల్సిన కార్యకలాపాలపై చర్చలు జరిపారు. అనంతరం APCRDA అధికారులు, విజిలెన్స్ ఫెసిలిటేటర్స్, NGO సంస్థలతో బృందం సమావేశమైంది. రైతులు, రైతు కూలీలకు అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాల గురించి చర్చించారు.


