News February 27, 2026
బుమ్రాను దాటేసిన అర్ష్‌దీప్.. T20 WC చరిత్రలో సరికొత్త రికార్డు

T20 WC చరిత్రలో టీమ్‌ఇండియా తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా అర్ష్‌దీప్ సింగ్ రికార్డు సృష్టించారు. జింబాబ్వేతో జరిగిన కీలక మ్యాచ్‌లో 3 వికెట్లు పడగొట్టిన అర్ష్‌దీప్.. బుమ్రా (33 వికెట్లు)ను అధిగమించి 35 వికెట్లతో అగ్రస్థానానికి చేరుకున్నారు. కేవలం 19 మ్యాచుల్లోనే ఈ ఘనత సాధించడం విశేషం. అలాగే అంతర్జాతీయ క్రికెట్‌లో 150 వికెట్ల మైలురాయిని కూడా దాటారు.
Similar News
News April 14, 2026
పెరిగిన బంగారం, వెండి ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో నిన్న తగ్గిన బంగారం, వెండి ధరలు ఇవాళ పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,470 పెరిగి రూ.1,53,930కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాములు పసిడి ధర రూ.1,350 ఎగబాకి రూ.1,41,100 పలుకుతోంది. అటు కేజీ సిల్వర్ రేటు రూ.5వేలు పెరిగి రూ.2,65,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ధరల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News April 14, 2026
అధిక పాలనిచ్చే ‘జఫరాబాది’ గేదెలు

జఫరాబాది జాతి గేదెలు గుజరాత్‌కు చెందినవి. వీటి కొమ్ములు మెలి తిరిగి ఉంటాయి. పొదుగు విస్తారంగా ఉంటుంది. నలుపు రంగులో ఉండే వీటి శరీర బరువు దాదాపు 460KGలు ఉంటుంది. ఇవి మొదటిసారి 36-40 నెలలకు ఎదకు వస్తాయి. 48-51 నెలల వయస్సులో మొదటి దూడకు జన్మనిస్తాయి. రోజుకు 15-18 లీటర్ల చొప్పున పాడి కాలంలో 2,336 లీటర్ల పాలను ఉత్పత్తి చేస్తాయి. వెన్న 9-10% వరకు వస్తుంది. ఒక్కో గేదె ధర రూ.80K-రూ.లక్ష వరకు ఉంటుంది.
News April 14, 2026
3,058 ఉద్యోగాలు.. పరీక్షల తేదీలు వచ్చేశాయ్

రైల్వేలో 3,058 NTPC(UG) ఉద్యోగాలకు పరీక్షల తేదీలను RRB విడుదల చేసింది. మే 7, 8, 9, జూన్ 13, 14, 16-21 తేదీల్లో ఎగ్జామ్స్ నిర్వహిస్తామని తెలిపింది. పరీక్షలకు 10 రోజుల ముందు అభ్యర్థులకు కేటాయించిన సిటీ పేరు, 4 రోజుల ముందు అడ్మిట్ కార్డులను రిలీజ్ చేస్తామని వెల్లడించింది. రోజూ 3 షిఫ్టుల్లో కంప్యూటర్ బేస్డ్ టెస్టు ఉంటుంది.


