News November 20, 2024
బుర్రలదిన్నెపల్లి టీచర్ సస్పెండ్
బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన బుర్రలదిన్నె పాఠశాల ఉపాధ్యాయుడు నాగముని నాయక్‌ను డీఈవో కె.సుబ్రహ్మణ్యం సస్పెండ్ చేశారు. మంగళవారం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సస్పెండ్ చేసినట్లు తెలిపారు. టి. సుండుపల్లి మండలం బుర్రలదిన్నె పాఠశాలలో ఎస్జీటీగా పని చేస్తున్న నాయక్ విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని తల్లిదండ్రులు ఆరోపించగా.. నిర్ధారణ కావడంతో సస్పెండ్ చేసినట్లు తెలిపారు.
Similar News
News December 10, 2024
కుందూ నదిలో పడి యువకుడు మృతి
కడప జిల్లా చాపాడు మండల కేంద్రమైన అదే గ్రామానికి చెందిన పూజారి సురేశం(32) అనే యువకుడు కుందూ నదిలో పడి మృతి చెందాడు. 10 రోజుల క్రితం దుబాయ్ నుంచి చాపాడుకు వచ్చిన సురేశ్ సోమవారం మధ్యాహ్నం కుందూ నది వద్దకు వెళ్లాడు. ఏం జరిగిందో తెలీదు గానీ సురేశ్ నదిలో కొట్టుకుపోవటాన్ని గమనించిన స్థానికులు కుటుంబానికి తెలిపారు. గాలింపు చేపట్టగా మంగళవారం ఉదయం మృతదేహం బయటపడింది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News December 10, 2024
బియ్యాన్ని పక్కదారి పట్టిస్తే కఠినంగా వ్యవహరిస్తాం: ఎస్పీ
పేదలకు అందాల్సిన బియ్యాన్ని పక్కదారి పట్టించేవారిపై కఠినంగా వ్యవహరిస్తామని అన్నమయ్య జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు హెచ్చరించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లాలో బియ్యం అక్రమ రవాణా జరగకుండా, రాయచోటి, మదనపల్లి, రాజంపేట, సబ్ డివిజన్ ప్రాంతాలలో రైస్ మిల్లులు, గోడౌన్లపై, సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తూ, పోలీసులకు స్పెషల్ టీంల సహకారంతో సోమవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
News December 10, 2024
14, 15వ తేదీలలో వైవీయూ రెండో దశ అంతర కళాశాలల క్రీడా పోటీలు
వైవీయూ అంతర్ కళాశాలల పురుషులు మహిళల క్రీడా పోటీలు ప్రొద్దుటూరు డా.వైఎస్సార్ ఇంజినీరింగ్ కళాశాలలో ఈనెల 14, 15 తేదిల్లో నిర్వహించనున్నట్లు క్రీడా బోర్డు కార్యదర్శి డా.కె. రామసుబ్బారెడ్డి తెలిపారు. పురుషులు మహిళలకువాలీబాల్, కబడ్డీ, టగ్ ఆఫ్ వార్ పోటీలు ఉంటాయన్నారు. ఈ క్రీడల్లో పాల్గొనేవారు ఈ ఏడాది జులై 1వ తేదీ నాటికి 17 – 25 సంవత్సరాల మధ్య ఉండాలన్నారు. వైవీయూ అనుబంధ కళాశాలలో చదువుతూ ఉండాలని తెలిపారు.