News February 19, 2025

బుల్లెట్ బ్యాక్ ఫైర్.. బాపట్ల జిల్లా జవాన్ మృతి

image

బాపట్ల జిల్లా పిట్టలవారిపాలెం మండలం గౌడపాలెంకు చెందిన 16వ కవలరి రెజిమెంట్ జవాన్ పరిసా వెంకటేశ్ మంగళవారం మృతి చెందాడు. రాజస్థాన్ ఫీల్డ్ ఫైరింగ్ ప్రాక్టీస్‌లో బుల్లెట్ బ్యాక్ ఫైర్‌తో అతను మృతిచెందినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. సూరత్ గర్ మిలిటరీ హాస్పిటల్ నుంచి బుధవారం వెంకటేశ్ పార్థివదేహం గుంటూరుకు హెలికాప్టర్‌లో వస్తున్నట్లు తెలిపారు. ఆయన మృతిపై పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Similar News

News September 18, 2025

ద్వారకాతిరుమల: శ్రీవారి క్షేత్రంలో ఆక్టోపస్ మాక్ డ్రిల్

image

ద్వారకాతిరుమల శ్రీవారి క్షేత్రంలో ఆక్టోపస్ మాక్ డ్రిల్‌ను నిర్వహించారు. అనుకోకుండా ఉగ్రవాదులు దాడులు జరిపినప్పుడు సమర్థవంతంగా ఎలా ఎదుర్కోవాలన్న దానిపై ఈ మాక్ డ్రిల్ చేశారు. ఆలయంలోనూ, కొండపైన, పరిసరాల్లో ఆక్టోపస్, పోలీస్, అగ్నిమాపక, రెవిన్యూ, వైద్య, దేవస్థానం సిబ్బంది ఈ మాక్ డ్రిల్‌ను నిర్వహించారు.

News September 18, 2025

పాఠశాలలోని సమస్యలను పరిష్కరించాలి: కలెక్టర్

image

ప్రభుత్వ పాటశాలలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో విద్యాశాఖ అధికారులు, సంబంధిత అధికారులతో మండలాల వారిగా, పాఠశాల సముదాయాల వారీగా సమీక్ష సమావేశం నిర్వహించారు. పాఠశాలల వారీగా ఆగస్టు నెల సగటు విద్యార్థుల హాజరు నివేదికలు, టాప్ 5 పాఠశాలలు, అట్టడుగు 5 పాఠశాలలు, పాఠశాల కాంప్లెక్స్ వారీగా సమస్యలు అడిగి తెలుసుకుని సూచనలు చేశారు.

News September 18, 2025

భద్రాచలం: డ్రిల్ బిట్‌ను మింగిన బాలుడు

image

భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో వైద్యులు అరుదైన శస్త్రచికిత్స చేసి బాలుడి ప్రాణాలు కాపాడారు. ఎటపాక మండలం చోడవరానికి చెందిన గౌతమ్‌(8) ఆడుకుంటూ డ్రిల్ బిట్‌ను మింగాడు. అది పేగులో ఇరుక్కోవడంతో బాలుడు తీవ్ర కడుపు నొప్పితో బాధపడ్డాడు. కుటుంబ సభ్యులు భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు మూడు గంటలపాటు శ్రమించి డ్రిల్ బిట్‌ను బయటకు తీసి బాలుడి ప్రాణాలు కాపాడారు.