News September 28, 2024
బుసరాజుపల్లి స్కూల్ టీచర్పై పోక్సో కేసు

ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం బుసరాజుపల్లి APTWR స్కూల్ విద్యార్థినితో అసభ్యకరంగా ప్రవర్తించిన డ్రాయింగ్ టీచర్ మురళీకృష్ణపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ దుర్గా మహేశ్వరరావు శనివారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థిని తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని స్పష్టం చేశారు. ITDA డిప్యూటీ డైరెక్టర్ నాయుడు శుక్రవారం ఈ కేసు విచారణ చేపట్టిన విషయం తెలిసిందే.
Similar News
News November 23, 2025
ప.గో: అర్హులందరికీ ఇళ్ల స్థలాలు

అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు అందించే దిశగా చర్యలు వేగవంతం చేయాలని జేసీ టి.రాహుల్ కుమార్ రెడ్డి ఆదేశించారు. శనివారం భీమవరంలో అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా ఆయన సమీక్షించారు. పాత లేఅవుట్లలోని ఖాళీ ప్లాట్లను గుర్తించి వీఆర్వో లాగిన్లో అప్డేట్ చేయాలన్నారు. పెనుగొండ, పెనుమంట్ర, అత్తిలి, పోడూరు మండలాల్లో డేటా ఎంట్రీ ప్రారంభమైందని, మిగిలిన చోట్ల ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాన్నారు.
News November 23, 2025
‘రైతన్న.. మీకోసం’ పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్

ఈ నెల 24 నుంచి 29 వరకు జరిగే ‘రైతన్న.. మీకోసం’ వారోత్సవాలను సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. శనివారం భీమవరం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆమె సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రతి రైతుకూ అవగాహన కల్పించాలని, శాఖలన్నీ సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా అధికారులకు దిశానిర్దేశం చేశారు.
News November 23, 2025
ప.గో: బొలెరో ఢీకొని యువకుడి మృతి

నరసాపురం హైవేపై జరిగిన ప్రమాదంలో మొగల్తూరుకు చెందిన మన్నే ఫణీంద్ర (21) దుర్మరణం పాలయ్యారు. శనివారం పాలకొల్లు నుంచి ద్విచక్ర వాహనంపై వస్తుండగా వెనుక నుంచి వచ్చిన బొలెరో ఢీకొట్టిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన ఫణీంద్రను మెరుగైన వైద్యం కోసం భీమవరం తరలిస్తుండగా దారిలో మృతి చెందారు. మృతుడి సోదరుడు వాసు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ జయలక్ష్మి తెలిపారు.


