News September 19, 2024

బూచేపల్లికి వైసీపీ జిల్లా అధ్యక్ష పదవి.?

image

దర్శి MLA బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి వైసీపీ ప్రకాశం జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇన్నాళ్లు ప్రకాశం జిల్లా వైసీపీ పెద్దగా వ్యవహరించిన బాలినేని అనూహ్యంగా రాజీనామా ప్రకటించారు. దీంతో జిల్లా బాధ్యతలు ఎవరు చేపడతారా? అనే చర్చ కొనసాగుతోంది. వైవీ సుబ్బారెడ్డి రాష్ట్రస్థాయిలో కీలకంగా ఉండటంతో బూచేపల్లికే అధ్యక్ష పదవి వస్తుందని భావిస్తున్నారు.

Similar News

News December 13, 2025

ప్రకాశం: అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల జాబితా విడుదల

image

ప్రకాశం జిల్లాలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్లగా ఎంపికైన 117 మందితో జాబితా విడుదల చేశామని డీఈవో రేణుక తెలిపారు. www.prakasamschooledu.com ద్వారా జాబితా చెక్ చేసుకోవాలని సూచించారు. ఈనెల 15వ తేదీలోగా కేటాయించిన పాఠశాలల్లో జాయిన్ కావాలని ఆదేశించారు. సంబంధిత హెచ్ఎంలు ప్రతి నెలా 2వ తేదీన డ్యూటీ సర్టిఫికేట్ సమగ్ర శిక్ష కార్యాలయంలో అందజేయాలన్నారు.

News December 13, 2025

ప్రకాశం జిల్లాలో 5.26 లక్షల సంతకాల సేకరణ

image

మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు నిరసనగా సేకరించిన సంతకాల పత్రాలను వైసీపీ రాష్ట్ర కార్యాలయానికి సోమవారం తరలిస్తామని దర్శి MLA బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి చెప్పారు. ఒంగోలులోని వైసీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. కాలేజీల ప్రైవేటీకరణకు నిరసనగా జిల్లాలో 5.26 లక్షల మంది సంతకాలు చేశారని చెప్పారు. వాటిని ప్రత్యేక వాహనం ద్వారా వైసీపీ ఆఫీసుకు తరలిస్తామన్నారు.

News December 13, 2025

ప్రకాశం: గ్యాస్ ఏజెన్సీలకు నోటీసులు

image

ప్రకాశం జిల్లాలోని 24 గ్యాస్ ఏజెన్సీలకు జేసీ గోపాలకృష్ణ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. గ్యాస్ డెలివరీ సమయంలో అధిక డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఐవీఆర్ఎస్ సర్వే ద్వారా తేలింది. ఇకపై డెలివరీ బాయ్ ప్రవర్తన, రసీదుకు మించి డబ్బులు ఎక్కువగా వసూలు చేసినా ఉపేక్షించేది లేదని జేసీ హెచ్చరించారు. మీ ఏరియాలో సిలిండర్ డెలివరీకి ఎక్కువ నగదు తీసుకుంటే ఊరిపేరు, ఏజెన్సీ పేరుతో కామెంట్ చేయండి.