News November 28, 2024
బూడిద వివాదం: జేసీ, ఆదిలకు సీఎం పిలుపు
జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిల మధ్య ఫ్లైయాష్ వివాదం నేపథ్యంలో ఇరువురి నేతలకూ సీఎం చంద్రబాబు నుంచి పిలుపువచ్చింది. ఇవాళ అమరావతికి వచ్చి తనను కలవాలని ఆదేశించినట్లు సమాచారం. మరోవైపు ఈ ఉచిత బూడిద వివాదంపై జిల్లా అధికారుల నుంచి సీఎం వివరాలను తెలుసుకున్నారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా నేతల వ్యవహారం ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Similar News
News December 4, 2024
అనంతపురం జిల్లా వాసులకు ఫ్రీగా కారు డ్రైవింగ్ శిక్షణ
అనంతపురం రూడ్ సెట్ సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగులకు ఉచితంగా కారు డ్రైవింగ్ నేర్పించనున్నట్లు సంస్థ డైరెక్టర్ విజయ లక్ష్మి తెలిపారు. ఈనెల 18 నుంచి జనవరి 17 శిక్షణ అందిస్తామని పేర్కొన్నారు. వయసు 19 నుంచి 45 సంవత్సరాలలోపు ఉండాలన్నారు. శిక్షణలో ఉచిత భోజనం, వసతి కల్పిస్తామని చెప్పారు. ఆసక్తిగల వారు అనంతపురంలోని తమ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.
News December 4, 2024
అనంతపురం జిల్లాలో భూప్రకంపనల ప్రభావం లేదు!
తెలుగు రాష్ట్రాల్లో భూప్రకంపనలు కలకలం సృష్టించాయి. తెలంగాణతో పాటు విజయవాడ, జగ్గయ్యపేట, నందిగామ తదితర ప్రాంతాల్లో కొన్ని సెకన్ల పాటు భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అయితే ఈ భూ ప్రకంపనల ప్రభావం అనంతపురం జిల్లాపై లేదు. దీంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. కాగా, 2017లో బెళుగుప్ప మండలం జీడిపల్లి, 2019లో ఉరవకొండ మండలం అమిద్యాలలో కొన్ని సెకన్ల పాటు భూమి కంపించిన విషయం తెలిసిందే.
News December 4, 2024
అనంతపురం జిల్లాలో మిద్దె కూలి ముగ్గురి మృతి
అనంతపురం జిల్లాలో విషాద ఘటన జరిగింది. రెండ్రోజులుగా తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న వర్షానికి కందుర్పిలో మిద్దె కూలింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. మృతులంతా ఒకే కుటుంబ సభ్యులు. మృతులు గంగన్న, సంధ్య, శ్రీదేవిగా గుర్తించారు. పాత మిద్దె కావడంతో వర్షానికి నాని కూలినట్లు తెలుస్తోంది.