News July 12, 2024
బూదవాడ ప్రమాద ఘటన.. మరొకరు మృతి

జగ్గయ్యపేట మండలం బూదవాడలోని అల్ట్రాటెక్ కర్మాగారం ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులలో ఇప్పటికే ఇద్దరు మృతి చెందగా గురువారం అర్ధరాత్రి మరొకరు ప్రాణాలు వదిలారు. మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బూదవాడకు చెందిన అర్జున్ తుది శ్వాస విడిచారు. ఆయన ఈ ఫ్యాక్టరీలో కొన్నేళ్ల నుంచి పని చేస్తున్నారు. నాలుగు రోజులుగా మృత్యువుతో పోరాడుతూ గురువారం తుదిశ్వాస విడిచారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య మూడుకు చేరింది.
Similar News
News February 19, 2025
వల్లభనేని వంశీ కేసులో అప్డేట్

మాజీ ఎమ్మెల్యే వంశీని కస్టడీకి ఇవ్వాలని పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిగింది. జైల్లో ప్రత్యేక వసతులు కల్పించాలని వంశీ దాఖలు చేసిన పిటిషన్‌పై ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో నేడు విచారణ జరిగింది. జైలులో వంశీకి అందిస్తున్న వివరాలను సమర్పించాలని జైలు అధికారులకు నోటీసులు జారీ చేశారు. జైలర్ వివరాల ప్రకారం తీర్పు ప్రకటిస్తామని న్యాయమూర్తి గురువారానికి కేసు వాయిదా వేశారు
News February 19, 2025
పామర్రు యువకుడిపై కేసు నమోదు

పామర్రు మండలం పెదమద్దాలికి చెందిన ఓ యువకుడిపై కేసు నమోదైంది. ఎస్ఐ రాజేంద్రప్రసాద్ తెలిపిన వివరాల మేరకు.. మండలానికి చెందిన బాలికను యువకుడు వేణు వేధిస్తున్నట్లు మంగళవారం బాలిక తల్లి పామర్రు పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. అతడిని పలుమార్లు హెచ్చరించినా తన పద్ధతి మార్చుకోలేదని ఆమె చెప్పినట్లు వివరించారు. ఈ విషయమై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పేర్కొన్నారు.
News February 19, 2025
పమిడిముక్కలలో యాక్సిడెంట్.. యువతి మృతి

పమిడిముక్కల మండలం తాడంకి వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువతి నర్రా లక్ష్మీ ప్రసన్న (20) అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికుల వివరాల మేరకు.. మచిలీపట్నానికి చెందిన లక్ష్మీ ప్రసన్న తాడిగడపలోని ఓ ప్రైవేటు కాలేజీలో బీసీఏ ఫైనల్ ఇయర్ చదువుతోంది. ప్రకాశం జిల్లాకు చెందిన యువకుడి బైక్‌పై ఆమె మచిలీపట్నానికి వెళ్తుండగా ప్రమాదవశాత్తు ఆగి ఉన్న లారీని ఢీ కొట్టారు. సీఐ చిట్టిబాబు కేసు నమోదు చేశారు.