News March 19, 2025
బూర్గంపాడు: ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య.!

బూర్గంపాడు మండలం ముసలమడుగు బీడ్జి దగ్గర్లో ఓ వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. బూర్గంపాడు ఎస్‌ఐ రాజేష్ ఘటనా స్థలానికి చేరుకొని చెట్టుకు ఉరి వేసుకున్న వ్యక్తిని స్థానికుల సాయంతో కిందికి దించి భద్రాచలం ప్రభుత్వ ఆస్పత్రి తరలించారు. మృతి చెందిన వ్యక్తి గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News July 11, 2025
కోనసీమ: ధాన్యం బకాయిలు రూ.188.87 కోట్లు విడుదల

అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో రైతుల నుంచి కొనుగోలు చేసిన రబీ ధాన్యం బకాయిలను ప్రభుత్వం విడుదల చేసింది. 9,505 మంది రైతులకు రూ.188.87 కోట్ల బకాయిలను విడుదల చేస్తామని జిల్లా పౌరసరఫరాల అధికారి శ్రీనివాస్ గురువారం తెలిపారు. జిల్లాలో మొత్తం 32,996 మంది వద్ద 2,69,986 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామన్నారు. రూ. 620.98 కోట్లు విలువైన ధాన్యం కొన్నారు.
News July 11, 2025
కృష్ణా: క్రియాశీలక రాజకీయాలకు నాని, వంశీ రెడీ

ఎన్నికల అనంతరం రాజకీయాలకు దూరంగా ఉన్న మాజీ MLAలు కొడాలి నాని, వల్లభనేని వంశీ తిరిగి రాజకీయంగా చురుగ్గా మారేందుకు సిద్ధమవుతున్నారు. ఎన్నికల్లో YCP ఓటమి, వంశీ అరెస్ట్, నాని ఆరోగ్య సమస్యలు వంటి పరిణామాల నేపథ్యంలో ఈ ఇద్దరూ ప్రజల కంటపడకుండా ఉన్నారు. నాని కొన్ని సందర్భాల్లో మీడియా ముందుకు వచ్చినప్పటికీ, వంశీ పూర్తిగా మౌనంగా ఉన్నారు. గుడివాడలో జరగనున్న YCP సమావేశంతో వీరు రాజకీయ ఎంట్రీ ఇవ్వనున్నారు.
News July 11, 2025
VJA: మరికొద్ది గంటలలో ముగియనున్న గడువు

అమరావతిలోని ఏపీ డెయిరీ డెవలప్మెంట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్(APDDCF)లో కాంట్రాక్ట్ పద్ధతిన 9 మేనేజర్ ఉద్యోగాల భర్తీకై నోటిఫికేషన్ విడుదలైంది. డైయిరీ టెక్నాలజీలో బీటెక్ చదివిన వారు ఈ ఉద్యోగాలకు అర్హులని APDDCF అధికారులు తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు https://apddcf.ap.gov.inలో జులై 11వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఎంపికైన వారికి రూ.30 వేల వేతనం ఇస్తామన్నారు.