News January 26, 2025

బూర్జ: బ్రెయిన్ డెడ్.. అవయవదానంకు అంగీకారం

image

బూర్జ మండలంలోని ఓవి పేట గ్రామానికి చెందిన పేడాడ దశరథరావు (59)బ్రెయిన్ డెడ్‌తో రిమ్స్ సర్వజన ఆసుపత్రిలో మరణించారు. అవయవదానానికి కుటుంబసభ్యులు ముందుకు రావడంతో కేసు నమోదు చేసినట్లు బూర్జ ఎస్ఐ ప్రవల్లిక తెలిపారు. మృతుడు పొలానికి వెళ్లి వస్తుండగా కోనేరు సమీపంలో కింద పడిపోవడంతో తలకు బలమైన గాయం తగిలి,అధిక రక్తస్రావం కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు ఎస్సై తెలిపారు.

Similar News

News February 19, 2025

కృష్ణా యూనివర్సిటీ వీసీగా పొందూరు వాసి

image

పొందూరు మండలం పెనుబర్తి గ్రామానికి చెందిన కూన రాంజీ విజయవాడలోని కృష్ణా యూనివర్సిటీ వైస్ ఛాన్సిలర్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం ఉత్తర్వులు విడుదలయ్యాయి. గతంలో ఆయన ఎచ్చెర్లలోని అంబేడ్కర్ యూనివర్సిటీ వీసీగా పనిచేశారు. ఈయన నియామకంపై పొందూరు వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరెన్నో పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు.

News February 19, 2025

SKLM: పోలీసులకు దొరికిన విద్యార్థులు

image

శ్రీకాకుళంలో గంజాయి కలకలం రేపింది. పాత్రునివలస టిడ్కో కాలనీలో మంగళవారం సాయంత్రం ఆరుగురు సీక్రెట్‌గా గంజాయి తాగుతుండగా రూరల్ పోలీసులు దాడులు చేశారు. దొరికిన వారంతా ఎంబీఏ, ఎంటెక్ విద్యార్థులుగా గుర్తించారు. ఇందులో వైజాగ్‌కు చెందిన ఇద్దరు, శ్రీకాకుళానికి చెందిన నలుగురు ఉన్నారు. సీఐ పైడపునాయుడు మాట్లాడుతూ.. ఇంకా కేసు నమోదు చేయలేదని.. దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు. 

News February 19, 2025

పాలకొండకు జగన్ రాక రేపు

image

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పర్యటనకు వైసీపీ అధినేత జగన్ రానున్నారు. ఇటీవల జడ్పీ మాజీ ఛైర్మన్ పాలవలస రాజశేఖరం చనిపోయారు. ఆయన కుటుంబాన్ని పరామర్శించడానికి జగన్ పాలకొండకు గురువారం రానున్నారు. ఈ మేరకు పాతపట్నం మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి ఓ ప్రకటన విడుదల చేశారు. జగన్ పర్యటన విజయవంతం చేయాలని ఆమె కోరారు.

error: Content is protected !!