News April 29, 2024
బూర్జ : శ్యాంమాస్టార్ కు డాక్టరేట్ ప్రదానం

బూర్జ మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బయోలాజికల్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న బొడ్డేపల్లి శ్యాంకు డాక్టరేట్కు ఎంపికయ్యారు. ఊటీలో ఐక్యరాజ్యసమితి శాంతి సంస్థ ఈ గౌరవ డాక్టరేట్ను అందించారు. పౌరాణిక నాటకాల్లో హరిశ్చంద్ర, గయోపాఖ్యానంలలో రాష్ట్ర స్థాయిలో విశేషంగా రాణిస్తున్నారు. నాటక రంగంలో చేస్తున్న ఈ విశేష కృషికి గుర్తింపుగా పీస్ కౌన్సిల్ వారు ఈ డాక్టరేట్ పట్టాను బహుకరించారు.
Similar News
News December 23, 2025
శ్రీకాకళం: చేపల వేటకు వెళ్లి మత్స్యకారుడు మృతి

కవిటి మండలం కొత్తపాలెం గ్రామానికి చెందిన మత్స్యకారుడు కర్రి విశ్వనాథం (34) మంగళవారం చేపల వేటకు వెళ్లి మృతి చెందారు. సముద్రంలో వేట సాగిస్తుండగా ప్రమాదవశాత్తు విశ్వనాథం సముద్రంలో పడిపోయే సమయంలో పడవకు ఉన్న ఫ్యాన్ ఆయనకు తగలడంతో ప్రాణాలు విడిచాడు. మృతుడికి భార్య ఈశ్వరి, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఘటనపై కవిటి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News December 23, 2025
SKLM: టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సుకు దరఖాస్తులు ఆహ్వానం

టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు పరీక్షలో డ్రాయింగ్, టైలరింగ్, ఎంబ్రాయిడరీ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ రవిబాబు మంగళవారం తెలిపారు. BSE.AP వెబ్సైట్లో దరఖాస్తు చేసిన సర్టిఫికెట్లు DEO కార్యాలయంలో సమర్పించాలని సూచించారు. డ్రాయింగ్ లోయర్ గ్రేడ్లో ఫీజు రూ.100, డ్రాయింగ్ HG ఫీజు రూ.150, టైలరింగ్, ఎంబ్రాయిడరీ LG రూ.150, టైలరింగ్, ఎంబ్రాయిడరీ HG రూ.200లు ఈ నెల 27లోపు చెల్లించాలన్నారు.
News December 23, 2025
శ్రీకాకుళం: ఆ రోడ్డుపై బారులు తీరిన టాక్టర్లు ఎందుకంటే?

నందిగం మండలంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియలో భాగంగా ధాన్యం లోడులతో రైతులు అవస్థలు పడుతున్నారు. పగలు, రాత్రి తేడా లేకుండా ధాన్యం బస్తాలతో నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. నందిగం మండలంలో 22 రైతు సేవా కేంద్రాల పరిధిలో ట్రక్ షీట్లు మంజూరు చేస్తుండగా 11 రైస్ మిల్లులో కొనుగోలు ప్రక్రియ జరగాల్సి ఉండగా సోమవారం నాటికి కేవలం 2 మిల్లులకు మాత్రమే బ్యాంకు గ్యారంటీలు ఉండడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు.


