News August 27, 2024

బూర్జ: షట్టర్లతో పాటు రెగ్యులేటర్ల‌కు లీకులు

image

బూర్జ మండలం నారాయణపురం ఆనకట్ట షట్టర్లు దెబ్బతినడంతో పాటు రెగ్యులేటర్ల లీకులు ఏర్పడటంతో శివారు ఆయకట్టుకు సాగునీరు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఖరీఫ్‌లో రెగ్యులేటర్ల మరమ్మతులు చేపట్టినట్లయితే ఫలితం ఉంటుందని రైతులు అంటున్నారు. అయితే దీనిపై సంబంధిత అధికారులకు సమాచారం అందించినప్పటికీ పట్టించుకోకుండా వదిలేశారని వాపోయారు. దీనిపై అధికారులు దృష్టి సారించాలని కోరారు.

Similar News

News September 19, 2025

ఇచ్ఛాపురం: 100 ఏళ్లు జీవించి..మరొకరికి వెలుగునిచ్చారు

image

ఇచ్ఛాపురం పట్టణ మేజిస్ట్రేట్ పరేష్ కుమార్ అమ్మమ్మ విజయలక్ష్మి (100) గురువారం మృతి చెందారు. ఆమె నేత్రాలను దానం చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని రెడ్ క్రాస్ ఛైర్మన్ జగన్మోహనరావుకు తెలియజేశారు. ఓ నేత్ర సేకరణ కేంద్రం ఐ టెక్నీషియన్స్ సుజాత, కృష్ణలు ఆమె కార్నియాను సేకరించారు.

News September 19, 2025

SKLM: 10 నుంచి 12 గంటల వరకే ఈ అవకాశం

image

ఇవాళ దివ్యాంగుల స్వాభిమాన్ గ్రీవెన్స్ కార్యక్రమం శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశంలో నిర్వహించనున్నట్లు జడ్పి సీఈఓ శ్రీధర్ రాజా తెలిపారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఉదయం 10 గంటల నుంచి 12:00 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చని పేర్కొన్నారు. జిల్లాలోని దివ్యాంగులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.

News September 19, 2025

ఎచ్చెర్ల: యూనివర్సటిలో సంస్కృతి కోర్సు ప్రారంభం

image

ఎచ్చెర్ల డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటిలో సంస్కృతి కోర్సును వైస్ ఛాన్సలర్ ఆచార్య డాక్టర్ కే ఆర్ రజిని ఇవాళ ప్రారంభించారు. ఈ మేరకు జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. పీఎం ఉష నిధుల ఆర్థిక సహకారంతో సంస్కృతంలో సర్టిఫికెట్ కోర్సును మొదలపెట్టామని చెప్పారు. సంస్కృతం భాష నుంచే మిగతా భాషలు వృద్ధి చెందాయని తెలియజేశారు.