News August 27, 2024
బూర్జ: షట్టర్లతో పాటు రెగ్యులేటర్లకు లీకులు
బూర్జ మండలం నారాయణపురం ఆనకట్ట షట్టర్లు దెబ్బతినడంతో పాటు రెగ్యులేటర్ల లీకులు ఏర్పడటంతో శివారు ఆయకట్టుకు సాగునీరు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఖరీఫ్‌లో రెగ్యులేటర్ల మరమ్మతులు చేపట్టినట్లయితే ఫలితం ఉంటుందని రైతులు అంటున్నారు. అయితే దీనిపై సంబంధిత అధికారులకు సమాచారం అందించినప్పటికీ పట్టించుకోకుండా వదిలేశారని వాపోయారు. దీనిపై అధికారులు దృష్టి సారించాలని కోరారు.
Similar News
News September 13, 2024
పలాస హాస్పిటల్లో అరుదైన ఆపరేషన్
పలాసలోని కిడ్నీ రీసెర్చ్ హాస్పిటల్లో అరుదైన ఆపరేషన్ జరిగింది. వజ్రపుకొత్తూరు మండలం గరుడభద్ర గ్రామానికి చెందిన యండమూరి నరసమ్మ(58) జీర్ణాశయంలో ఇబ్బంది ఉందని హాస్పిటల్‌కి వచ్చారు. స్కాన్ చేసి కడుపులో గడ్డ ఉందని గుర్తించారు. స్త్రీల వైద్య నిపుణులు డాక్టర్ కవిటి సాహితీ, మత్తు డాక్టర్ తృప్తి సహాయంతో సుమారు 5 కేజీల బరువున్న గడ్డని తొలగించారు.
News September 13, 2024
శ్రీకాకుళంలో టుడే టాప్ స్టోరీస్
✵ నందిగాంలో నకిలీ నోట్ల కలకలం ✵ శ్రీకాకుళంలో నాలుగు ఇసుక ర్యాంపులు ✵ అలసత్వం వహిస్తే చర్యలు: అచ్చెన్న ✵ శ్రీకాకుళం-తిరుపతికి ప్రత్యేక రైళ్లు ✵ న్యూకాలనీలో తవిటమ్మ మృతి నేత్రాలు మరొకరికి దానం ✵ ఈనెల 14న జిల్లాకు జాతీయ ST కమిషన్ సభ్యుడు ✵ ఓపెన్ టెన్త్, ఇంటర్ ప్రవేశాలకు గడువు పెంపు ✵ జిల్లా విజిలెన్స్ ఎస్పీగా బి. ప్రసాదరావు ✵ వంశధార కాలువలో పడి వ్యక్తి మృతి ✵ సోంపేటలో పొలాల్లోకి దూసుకెళ్లిన బస్సు
News September 12, 2024
SKLM: పాము కాటుతో మహిళ మృతి
శ్రీకాకుళం జిల్లాలో విషాద ఘటన జరిగింది. బూర్జ గ్రామానికి చెందిన ఖండ్యాపు లక్ష్మీ(53) గురువారం పొలానికి వెళ్లారు. అక్కడ పాము కాటు వేయడంతో పొలంలోనే మృతిచెందారు. మృతదేహాన్ని శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి తరలించారు. గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు.