News July 30, 2024
బెంగళూరులో కారు ప్రమాదం.. కావలి వాసి మృతి

కావలి రూరల్ మండలం ఆముదాలదిన్నె వాసి ఉప్పాల శివ కోటయ్య మంగళవారం బెంగుళూరులో కారు ప్రమాదంలో మృతి చెందాడు. శివ కోటయ్య తెలుగుదేశం పార్టీకి వీర అభిమానిగా, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అభిమానిగా గ్రామంలో సుపరిచితుడు. కుటుంబ సభ్యులు హుటాహుటీన బెంగుళూరుకు తరలి వెళ్లారు. విషయం తెలుసుకున్న పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు కోటయ్య మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు.
Similar News
News November 22, 2025
మంత్రి ఆనం రేపటి పర్యటనా వివరాలు

మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆదివారం జిల్లా పరిధిలో పలు దేవాలయాల్లో పూజా కార్యక్రమాలు, శంకుస్థాపనలు, అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొననున్నారు. ఉదయం 9 గంటలకు శ్రీపెనుశిల లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనం చేసుకుంటారు. అనంతరం శ్రీ ఆదిలక్ష్మీ అమ్మవారి ఆలయ పునర్నిర్మాణం, దేవాలయ ప్రాంగణంలో అనివేటి మండపం నిర్మాణానికి వెంకటగిరి MLAతో కలిసి పాల్గొననున్నారు.
News November 22, 2025
ఆత్మకూరు: పెన్నా నదిలో చిక్కుకున్న ఆరుగురు

ఆత్మకూరు మండలం అప్పారావుపాలెం వద్ద పెన్నానదిలో ఆరుగురు పశువుల కాపర్లు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఉదయం గ్రామం నుంచి పశువులు మేపుకునేందుకు నదిలోకి వెళ్లిన కాపర్లు ఒక్కసారిగా వచ్చిన నీటి ప్రవాహంతో నది మధ్యలో చిక్కుకున్నారు. వారిలో వెంకట రమణయ్య, శ్రీనివాసులు, కాలేషా, కవిత, చెన్నయ్యతోపాటు మరో మహిళ ఉన్నట్లు సమాచారం. వీరిని కాపాడేందుకు పోలీసులు రంగంలో దిగారు.
News November 22, 2025
మార్చి 16 నుంచి 10వ తరగతి పరీక్షలు: డీఈవో

వచ్చే ఏడాది మార్చి 16వ తేదీ నుంచి పదవ తరగతి పరీక్షలు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ ఆర్ బాలాజీ రావు ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12. 45 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జిల్లాలోని ఉపాధ్యాయులు ఈ విషయాన్ని గమనించి 10వ తరగతి ఫలితాల్లో 100% ఉత్తీర్ణత వచ్చేలా కృషి చేయాలని కోరారు.


