News May 25, 2024
బెంగళూరు-తిరుపతి హైవేపై రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

బైక్ అదుపుతప్పిన ప్రమాదంలో ఒకరు మృతిచెందగా, మరొకరు తీవ్రంగా గాయపడిన ఘటన తవణంపల్లెలో చోటుచేసుకుంది. SI సుధాకర్ రెడ్డి వివరాల మేరకు.. బంగారుపాళ్యం (M) దండువారిపల్లెకు చెందిన వాసుబాబు, హర్షవర్ధన్ రావు బైక్ పై వెళ్తూ బెంగళూరు-తిరుపతి హైవేపై తెల్లగుండ్లపల్లె వద్ద కిందపడ్డారు. గాయపడ్డ ఇద్దరినీ ఆసుపత్రికి తరలించగా చికిత్సపొందుతూ వాసుబాబు మరణించాడన్నారు. కేసునమోదు చేసినట్టు తెలిపారు.
Similar News
News December 1, 2025
ఆ వ్యాధి గురించి భయపడకండి: చిత్తూరు DMHO

చిత్తూరు జిల్లాలో ఇప్పటి వరకు స్కబ్ టైపన్ కేసులు 149 నమోదయ్యాయని.. అందరూ కోలుకున్నారని DMHO సుధారాణి వెల్లడించారు. చిన్న నల్లి లాంటి ప్రాణి కుట్టడంతో ఈ వ్యాధి వస్తుందన్నారు. తలనొప్పి, జ్వరం, కండరాల నొప్పులు ఉంటాయని తెలిపారు. బురదలో నడిచినప్పుడు, పొలాల్లో చెప్పులు లేకుండా తిరిగినప్పుడు ఇవి కుడుతాయన్నారు. జ్వరం వచ్చిన వెంటనే డాక్టర్‌ను సంప్రదిస్తే యాంటి బయోటిక్స్ ద్వారా నయమవుతుందని స్పష్టం చేశారు.
News December 1, 2025
తుఫాన్ ఎఫెక్ట్.. రూ.700కు చేరిన టమాటా

దిత్వా తుఫాను ఎఫెక్ట్ టమాటా ధరలపై పడింది. పుంగనూరు మార్కెట్‌లో సోమవారం 15 కిలోల టమాటా బాక్స్ రూ.700 పలికింది. 66.19 మెట్రిక్ టన్నుల కాయలు వచ్చాయి. రెండో రకం రూ.500, మూడో రకం రూ.350 చొప్పున వ్యాపారులు రైతుల నుంచి కొనుగోలు చేశారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ధరలు పెరిగినట్లు రైతులు తెలిపారు.
News December 1, 2025
చిత్తూరులో అర్జీలు స్వీకరించిన కలెక్టర్

చిత్తూరు జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం గ్రీవెన్స్ డే నిర్వహించారు. ప్రజల నుంచి కలెక్టర్ సుమిత్ కుమార్ అర్జీలను స్వీకరించారు. పలువురు సమస్యలను ఆయన నేరుగా తెలుసుకున్నారు. వాటిని సంబంధిత అధికారులకు పంపారు. సకాలంలో సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. గ్రీవెన్స్ డేలో డీఆర్వో మోహన్ కుమార్, అసిస్టెంట్ కలెక్టర్ నరేంద్ర పాడేల్, ఆర్డీవో శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.


