News July 26, 2024
బెంగళూరు నుంచి ఓర్వకల్లుకు విమాన సర్వీస్ పునరుద్దరణ: ఎంపీ శబరి
బెంగళూరు-ఓర్వకల్లు విమాన సర్వీస్ పునరుద్దరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి తెలిపారు. శుక్రవారం ఆమె మాట్లాడుతూ.. ఓర్వకల్లు నుంచి గతంలో బెంగళూరుకు సర్వీస్ నడిచేదని, కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ సర్వీస్ రద్దయిందని తెలిపారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో చర్చించి ఆగస్టు 16 నుంచి ప్రతి సోమ, బుధ, శుక్రవారాలలో ఆ సర్వీస్ నడిచేలా పునరుద్దరించామని తెలిపారు. త్వరలో కర్నూలు-విజయవాడకు సర్వీస్ నడుస్తుందన్నారు.
Similar News
News October 7, 2024
ఉమ్మడి కర్నూలు జిల్లాలో 519 దరఖాస్తులు!
ఉ.కర్నూలు జిల్లాలో మద్యం దుకాణాలకు దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోంది. ఇప్పటివరకు నంద్యాల జిల్లాలో 105 మద్యం దుకాణాలకు గానూ 217, కర్నూలు జిల్లాలో 99 దుకాణాలకు గానూ 302 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుల స్వీకరణకు ఇక మూడు రోజులే గడువుంది. అయితే జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లో ముఖ్యనేతలు మద్యం దుకాణాలకు ఎవరూ దరఖాస్తులు వేయొద్దని, వాటిని తమకు వదిలేయాలని వ్యాపారులను హెచ్చరిస్తున్నట్లు విమర్శలొస్తున్నాయి.
News October 7, 2024
కర్నూలు: కాల్వబుగ్గ దేవాదాయ శాఖ అధికారి భారీ కుంభకోణం?
కర్నూలు కాల్వబుగ్గ దేవాదాయ శాఖ అధికారి చేతివాటం ప్రదర్శించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. కాగా ఆయన ప్రస్తుతం వేరే ప్రాంతానికి బదిలీ అవ్వగా అసలు విషయాలు బయటపడ్డాయి. ఆయన ఆలయం పేరిట సొంత ఖాతా తెరచి రూ.1.30 కోట్లు దారి మళ్లించినట్లు తెలుస్తోంది. బినామీలు, సిబ్బంది పేరిట డబ్బులు విత్ డ్రా చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
News October 7, 2024
నందికొట్కూరు: రూ.100కి చేరిన టమాటా
నందికొట్కూరులో కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ముఖ్యంగా టమాటా ధర అమాంతం పెరిగింది. హోల్సేల్ మార్కెట్లో టమోటా ధర రూ.70 -80 పలుకుతోంది. నందికొట్కూరు సంత మార్కెట్ లో సోమవారం రిటైల్ మార్కెట్లో టమాటా ధర రూ.100 దాటిందని కొనుగోలుదారులు ఆందోళన వ్యక్తం చేశారు. భారీ వర్షాలకు పంట దెబ్బతినడంతో ఉల్లి ధర కూడా రూ.70- 80 కి చేరిందన్నారు.