News December 19, 2024
బెంగళూరు యువతులతో తిరుపతిలో హైటెక్ వ్యభిచారం

బెంగళూరు యువతులతో తిరుపతిలో హైటెక్ వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా గుట్టు రట్టయింది. తిరుచానూరు సీఐ సునీల్ కుమార్ కథనం..కర్ణాటక రాష్ట్రం బళ్లారికి చెందిన కుమార్, దేవళంపేటకు చెందిన పార్థసారథి తిరుపతి రూరల్ మండలం వేదాంతపురం పంచాయతీ విద్యుత్‌నగర్ వద్దనున్న ఓ హోమ్ స్టేకు బెంగళూరు నుంచి యువతులను రప్పించి వ్యభిచారం నిర్వహిస్తున్నారు. నిర్వాహకులు కుమార్, పార్థసారథి, విటుడు సోమశేఖర్‌ను అరెస్ట్ చేశారు.
Similar News
News November 3, 2025
చిత్తూరు: ఆధార్ అప్ డేట్ గడువు పెంపు

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల ఆధార్ అప్డేట్కు ప్రభుత్వం ఈనెల 6వ తేదీ వరకు గడువు పొడిగించిందని డీఈవో వరలక్ష్మి వెల్లడించారు. విద్యార్థుల ఆధార్ అప్డేట్ను 6వ తేదీ లోపు పూర్తి చేసేలా హెచ్ఎంలు, ఎంఈవో, డీవైఈవోలు చర్యలు చేపట్టాలన్నారు. ఎంపీడీవోలతో సమన్వయం చేసుకుని పెండింగ్ ఉన్న విద్యార్థుల ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ పూర్తి చేయించాలని ఆమె ఆదేశించారు.
News November 3, 2025
నాన్న సారీ అంటూ యువకుడి ఆత్మహత్య

పెనుమూరు(M) విడిదిపల్లికి చెందిన డి.అరవింద్ (17) ప్రేమ విఫలమై ఆదివారం ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. అక్టోబర్ 24 నుంచి అతను కనిపించకపోవడంతో కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తోటి విద్యార్థినితో అరవింద్ విజయవాడలో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు గుర్తించి ఇంటికి తీసుకువచ్చారు. నచ్చిన అమ్మాయి దూరమైందని డిప్రెషన్‌కు గురైన అరవింద్ నాన్న సారీ అని లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు.
News November 2, 2025
చిత్తూరు: వారికి రేపు పింఛన్ల పంపిణీ

చిత్తూరు జిల్లాలో తొలిరోజే ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ 95.20 శాతం పూర్తి చేసినట్లు అధికారులు వెల్లడించారు. 2,67,786 మంది లబ్ధిదారులు ఉండగా 2,54,943 మందికి గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా పింఛను సొమ్ము అందజేశారు. ఇవాళ ఆదివారం సెలవు కావడంతో మిగిలిన 12,843 మందికి సోమవారం పింఛన్ ఇవ్వనున్నారు.


