News December 19, 2024

బెంగళూరు యువతులతో తిరుపతిలో హైటెక్ వ్యభిచారం

image

బెంగళూరు యువతులతో తిరుపతిలో హైటెక్ వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా గుట్టు రట్టయింది. తిరుచానూరు సీఐ సునీల్ కుమార్ కథనం..కర్ణాటక రాష్ట్రం బళ్లారికి చెందిన కుమార్, దేవళంపేటకు చెందిన పార్థసారథి తిరుపతి రూరల్ మండలం వేదాంతపురం పంచాయతీ విద్యుత్‌నగర్ వద్దనున్న ఓ హోమ్ స్టేకు  బెంగళూరు నుంచి యువతులను రప్పించి వ్యభిచారం నిర్వహిస్తున్నారు. నిర్వాహకులు కుమార్, పార్థసారథి, విటుడు సోమశేఖర్‌ను అరెస్ట్ చేశారు.

Similar News

News January 20, 2025

చిత్తూరు జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ తొలగింపు

image

చిత్తూరు జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌గా ఉన్న మధుబాలను తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. గత ప్రభుత్వ హయాంలో గ్రంథాలయ ఛైర్మన్లను నియమించారు. అయితే ఇవి నామినేటెడ్ పోస్టుల కావడంతో కొందరు ప్రభుత్వం మారిన కొనసాగుతున్నారు. దీంతో వారిని తొలగిస్తూ ప్రభుత్వ కార్యదర్శి కోన శశిధర్ ఉత్తర్వులు విడుదల చేశారు.

News January 19, 2025

చిత్తూరు: కానిస్టేబుల్ అప్పీల్ కార్యక్రమం వాయిదా

image

ఈ నెల 20వ తేదీన జరగవలసిన కానిస్టేబుల్‌ల అప్పీల్ కార్యక్రమాన్ని ఈ నెల 22వ తేదీకి వాయిదా వేసినట్లు చిత్తూరు ఎస్పీ మణికంఠ చందోలు తెలిపారు.  అప్పీల్ చేయవలసిన అభ్యర్థులు గమనించాలని కోరారు. తల్లితండ్రులు దళారులను, మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దని సూచించారు. అలాంటివారు ఎవరైనా ఉంటే 112, 9440900005 నంబర్లకు మెసేజ్ చేయాలని కోరారు.

News January 18, 2025

CTR: పోలీస్ రిక్రూట్‌మెంట్‌లో మహిళకు గాయాలు

image

చిత్తూరు జిల్లాలో పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ జరుగుతోంది. ఈక్రమంలో ఓ మహిళ గాయపడింది. వెంటనే రిక్రూట్మెంట్ ఇన్‌ఛార్జ్, సత్యసాయి జిల్లా ఎస్పీ వి.రత్న సంబంధిత సిబ్బంది ద్వారా ఆమెను ఆసుపత్రికి తరలించారు. బాధితురాలు వాయల్పాడుకు చెందిన షకీలాగా గుర్తించారు. 1600 మీటర్ల పరుగు పందెంలో కాలుజారి కిందపడటంతో గాయపడ్డారు.