News February 7, 2025
బెంగుళూరు బయలుదేరిన వైఎస్ జగన్

మాజీ సీఎం జగన్ శుక్రవారం ఉదయం బెంగుళూరు బయలుదేరారు. తాడేపల్లిలోని తన నివాసం నుంచి రోడ్డు మార్గాన గన్నవరం విమానాశ్రయం చేరుకున్న జగన్ అక్కడి నుంచి బెంగుళూరు ప్రయాణమయ్యారు. కాగా జగన్‌ను కలిసేందుకు పెద్ద సంఖ్యలో ఎయిర్‌పోర్ట్‌కు వైసీపీ నాయకులు, కార్యకర్తలు చేరుకోగా వారికి నమస్కరించిన ఆయన బెంగుళూరు పయనమయ్యారు.
Similar News
News March 27, 2025
బిడ్డకు ‘హింద్’ అని పేరుపెట్టిన దుబాయ్ ప్రిన్స్

దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమదాన్, షేఖా షేఖా బింట్ సయీద్ బిన్ థాని అల్ మఖ్తూమ్ దంపతులు తమ నాలుగో బిడ్డకు ‘హింద్’ అని పేరుపెట్టడం చర్చకు దారితీసింది. ఆ పదానికి అర్థం ‘సమృద్ధి’ అని తెలిసింది. శిశువుకు అమ్మమ్మ ‘షేఖా హింద్ బింట్ మఖ్తూమ్ బిన్ జుమా అల్ మక్తూమ్’ పేరునే పెట్టడం విశేషం. ‘దేవుడి ఆశీర్వాదంతో మాకు పుట్టిన నాలుగో బిడ్డకు హింద్‌గా నామకరణం చేశాం’ అని ప్రిన్స్ తెలిపారు.
News March 27, 2025
కొత్తగూడెంలో నిరుద్యోగులకు GOODNEWS.. రేపే!

జిల్లాలో నిరుద్యోగ యువతకు భద్రాద్రి కొత్తగూడెం ఉపాధి కల్పనాధికారి కొండపల్లి శ్రీరామ్ గుడ్ న్యూస్ చెప్పారు. పాల్వంచ డిగ్రీ కళాశాలలో ఈనెల 28న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 18 నుంచి 25 ఏళ్ల లోపు ఉండి SSC, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ పూర్తి చేసిన నిరుద్యోగ యువత అప్లై చేసుకోవాలన్నారు. ప్రైవేటు కంపెనీల్లో 550 ఉద్యోగాలకు గాను ముఖాముఖి నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.
News March 27, 2025
నటి రన్యా రావుకు షాక్

గోల్డ్ స్మగ్లింగ్ కేసులో అరెస్టైన కన్నడ నటి రన్యారావుకు షాక్ తగిలింది. ఆమె బెయిల్ పిటిషన్‌ను బెంగళూరు సెషన్స్ కోర్టు కొట్టివేసింది. మరోవైపు ఈ కేసులో రన్యా రావుకు సహకరించిన సాహిల్ జైన్‌ను తాజాగా డీఆర్ఐ అధికారులు అరెస్ట్ చేశారు.