News September 21, 2024
బెజ్జంకి: కుటుంబ కలహాలో తల్లీ, కూతురు ఆత్మహత్య
సిద్దిపేట జిల్లా బెజ్జంకిలో తీవ్ర విషాదం నెలకొంది. ఓ తల్లి తన కూతురితో సహా సూసైడ్ చేసుకుంది. స్థానికుల సమాచారం.. జనగాం జిల్లాకు చెందిన రాజు జీవనోపాధి కోసం కుటుంబంతో కలిసి బెజ్జంకి మండలానికి వలస వచ్చి కూలీ పనులు చేస్తున్నారు. రాజు మద్యానికి బానిసై తరుచుగా భార్య శారద, పిల్లలతో గొడవ పడేవాడు. గురువారం అర్ధరాత్రి సైతం గొడవ పడగా మనస్తాపానికి గురై శారద కుమార్తెతో సాహ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది.
Similar News
News October 7, 2024
MDK: గ్రంథాలయ సంస్థలకు నూతన ఛైర్మన్‌లు
తెలంగాణలో బతుకమ్మ పండుగకు ముందు నామినేటెడ్ పోస్టుల భర్తీ జాతర మొదలైంది. తాజాగా రాష్ట్రంలోని పలు జిల్లాల గ్రంథాలయ సంస్థలకు ఛైర్మన్‌లను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. మెదక్ జిల్లా గ్రంథాలయ బోర్డు ఛైర్‌పర్సన్‌గా చిలుముల సుహాసిని రెడ్డి, సంగారెడ్డి జిల్లా గ్రంథాలయ బోర్డ్ ఛైర్మన్‌గా గొల్ల అంజయ్యను నియమించింది.
News October 6, 2024

సంగారెడ్డి: రైతుల ఖాతాలో పీఎం కిసాన్ నిధులు
సంగారెడ్డి జిల్లాలోని రైతులకు 18వ విడత పీఎం కిసాన్ నిధులు రైతులకు సంబంధించిన ఖాతాలలో జమ అయ్యాయని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శివ కుమార్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నిధులను వ్యవసాయ పనులకు వినియోగించుకోవడానికి ఉపయోగపడతాయని తెలిపారు. ఈ సందర్భంగా రైతులు నిధులు జమ కావడంతో సంతోషం వ్యక్తం చేశారు.