News February 27, 2026
బెజ్జంకి: సర్పంచులకు 5 రోజులపాటు శిక్షణ కార్యక్రమం

ఈనెల 23 నుంచి 27 వరకు సిద్దిపేటలో ఐదు రోజులపాటు సర్పంచ్‌లకు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. బెజ్జంకి, జగదేవ్పూర్, వర్గల్, నంగునూరు మండలాలకు చెందిన 101 మంది సర్పంచులు పాల్గొన్నారు. పారిశుద్ధ్యం, చెట్ల పెంపకం, వీధి దీపాల ఏర్పాటు, అభివృద్ధి పనుల నిర్వహణ వంటి అంశాలపై రిసోర్స్ పర్సన్లు రామకృష్ణారెడ్డి, సమ్మిరెడ్డి, మల్లికార్జున్, శ్రీనివాసరావు, చెన్నారెడ్డి, శ్రీనివాస్ శిక్షణ అందించారు.
Similar News
News April 15, 2026
SKLM: ఇద్దరిని చంపిన వ్యక్తి సూసైడ్

పలాస మండలం మహదేవపురానికి చెందిన రామారావు(45) మంగళవారం ఆత్మహత్య చేసుకున్నాడు. గతేడాది జరిగిన జంట హత్యల కేసులో నిందితుడైన ఇతడు, నెల కిందటే బెయిల్‌పై బయటకు వచ్చాడు. బుధవారంతో గడువు ముగియనుండగా, పూచీకత్తు ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో జీవిత ఖైదు తప్పదని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎస్ఐ ఆర్‌వీఆర్ నాయుడు తెలిపారు.
News April 15, 2026
న్యూడ్ వీడియో కాల్స్ రాకెట్.. అమాయక మహిళలే టార్గెట్?

AP: గుంటూరు(D) తెనాలిలో న్యూడ్ వీడియో కాల్స్ రాకెట్ కలకలం రేపుతోంది. ఈ కేసుతో సంబంధం ఉన్న ఇద్దరు మహిళలను ఇటీవల అరెస్టు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అక్రమార్కులు డబ్బు ఆశచూపి 80-100 మంది అమాయక మహిళలను ఈ రొంపిలోకి దింపినట్లు సమాచారం. వారికి ఒక్కో ఆన్‌లైన్ కాల్‌కు రూ.500-1,000 ఇస్తున్నట్లు తెలుస్తోంది. వీరికి అట్రాక్ట్ అయ్యి వచ్చే వ్యక్తుల నుంచి భారీగా వసూలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
News April 15, 2026
కరీంనగర్‌లో ఠాగూర్ సీన్ రిపీట్..!

KNRలో ఠాగూర్ సినిమాలోని సీన్ రిపీటైంది. వేములవాడ(M) శాత్రాజ్‌పల్లికి చెందిన సాహెబ్ బీ(60) గుండెవ్యాధితో కోర్టు సమీపంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. నిన్న సర్జరీ చేయగా మృతిచెందింది. బతికే ఉన్నట్లు, వైద్యం చేస్తున్నట్లు కుటుంబసభ్యులను మభ్యపెడుతుండగా, అనుమానంతో బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగడంతో పోలీసులు వచ్చి శవాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. డాక్టర్లపై KNR-2 టౌన్ PSలో కేసు నమోదైంది.


