News February 6, 2025
బెజ్జూర్: పంచాయతీ కార్యదర్శులతో MEETING

మండల అభివృద్ధి కార్యాలయంలో నేడు పంచాయతీ కార్యదర్శులతో ప్రత్యేక సమావేశం నిర్వహించినట్లు ఎంపీడీవో గౌరీశంకర్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ వెంకటేశ్ దోత్రే ఆదేశానుసారం ఎన్నికల నిర్వహణపై పంచాయతీ కార్యదర్శులతో ప్రత్యేక సమావేశం నిర్వహించామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఏ క్షణంలో ఆయన రావచ్చని అందుకు సిద్ధంగా ఉండాలని సిబ్బందికి సూచించినట్లు తెలిపారు.
Similar News
News December 24, 2025
ఎడారిలో మంచు: ప్రకృతి ఇస్తున్న డేంజర్ సిగ్నల్!

సౌదీ ఎడారిలో మంచు కురవడం అందంగా అనిపించినా అది భూమి మనకిస్తున్న గట్టి వార్నింగ్. వాతావరణ మార్పుల వల్ల వేడి పెరగడమే కాదు ప్రకృతి గతి తప్పడం దీనికి అసలు కారణం. మన ఇండియాకూ ఇది ప్రమాద సంకేతమే. పెరిగిన ఎండలు, అకస్మాత్తుగా భారీ వర్షాలు, వరదలే ఇందుకు నిదర్శనం. ఇలాంటి విపత్తులు ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉండాలి. నగరాల నిర్మాణం, వ్యవసాయం పట్ల కొత్తగా ఆలోచించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
News December 24, 2025
ఎం-కేడ్ పథకంతో పెద్దగెడ్డ ప్రాజెక్టు అభివృద్ధి: VZM కలెక్టర్

ఎం-కేడ్ పథకం ద్వారా పెద్దగెడ్డ ప్రాజెక్టును ఆధునీకరించేందుకు రూ.78.2 కోట్ల ప్రతిపాదనలు పంపినట్లు కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి బుధవారం తెలిపారు. కేంద్ర, రాష్ట్ర నిధుల వాటా 60:40గా ఉండనుందన్నారు. ప్రాజెక్టు ద్వారా 7,567 ఎకరాల ఆయకట్టు సాగులోకి రానుందని, భూగర్భ పైప్లైన్లు, సెన్సార్లు, జీపీఎస్ సాయంతో ఆధునికంగా నీటి పంపిణీ చేపడతామన్నారు. పాచిపెంట, రామభద్రపురం మండలాలకు సాగునీటి లబ్ధి చేకూరనుందన్నారు.
News December 24, 2025
బోరబండలో BRSను పాతిపెట్టినం: CM రేవంత్ రెడ్డి

కోస్గి సభలో BRS, KCR మీద CM రేవంత్ హాట్ కామెంట్స్ చేశారు. ‘BRSను అసెంబ్లీలో ఓడగొట్టినం. లోక్సభలో గుండు సున్నా ఇచ్చినం. కంటోన్మెంట్లో బండకేసి కొట్టినం. మొన్న జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బోరబండ బండ కింద పాతిపెట్టినం. సర్పంచ్లను గెలిపించుకున్నాం. ఇన్ని సార్లు BRSను ఓడించినా సిగ్గులేకుండా పైచేయి మాదే అంటున్నారు. పొంకనాలు వద్దు KCR చేతనైతే అసెంబ్లీకి రండి’ అంటూ CM సవాల్ చేశారు.


