News January 26, 2025
బెజ్జూర్: పురుగుమందు తాగి మృతి

బెజ్జూర్ మండలం కుంటలమానపల్లికి చెందిన బోర్కుట్ ఎమ్మాజీ (48) శనివారం రాత్రి పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. అపస్మారక స్థితిలో పడి ఉన్న ఎమ్మాజీని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందినట్లు తెలిపారు. పోలీసులకు సమాచారం అందించినట్లు భార్య రుక్మాబాయి తెలిపారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
Similar News
News February 17, 2025
శ్రీశైలం బ్రహ్మోత్సవాలకు సీఎం చంద్రబాబు ఆహ్వానం

శ్రీశైలం మహా క్షేత్రంలో ఫిబ్రవరి 19 నుంచి మార్చి ఒకటో తేదీ వరకు జరగనునున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని సీఎం చంద్రబాబుకు శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, దేవస్థానం శ్రీనివాసరావు ఆహ్వానపు పత్రికను అందజేశారు. ఈమేరకు అమరావతిలోని వెలగపూడిలో గల సచివాలయంలో సీఎం చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. అలాగే స్వామివారి శేష వస్త్రాలు, ప్రసాదాన్ని అందజేశారు.
News February 17, 2025
కాంగ్రెస్‌పై విపక్షాలది తప్పుడు ప్రచారం: మంత్రి శ్రీధర్ బాబు

TG: జనాభా ప్రకారం BCలకు రిజర్వేషన్లు కల్పించాలని కులగణన చేపట్టినట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. కాంగ్రెస్‌కు మంచి పేరు వస్తుందనే విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని దుయ్యబట్టారు. తాము అధికారంలోకి వచ్చాక ఒక్కొక్కటిగా హామీలను అమలు చేస్తున్నామని చెప్పారు. పెద్దపల్లిలో పట్టభద్రుల MLC అభ్యర్థికి మద్దతుగా ప్రచారంలో ఆయన మాట్లాడారు. BC రిజర్వేషన్ల కోసం కేంద్రం రాజ్యాంగ సవరణ చేయాలని డిమాండ్ చేశారు.
News February 17, 2025
సూర్యాపేట: రంజాన్ నెలలో ముస్లిం ఉద్యోగులకు వెసులుబాటు

రంజాన్ నెలలో ముస్లిం ప్రభుత్వ ఉద్యోగులు ఒక గంట ముందు తమ కార్యాలయం నుంచి వెళ్లాడానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి రెండో తేదీ నుంచి 30వ తేదీ వరకు ఈ ఉత్తర్వుల ప్రకారం ముస్లిం ప్రభుత్వ ఉద్యోగులు విధుల నుంచి గంట ముందు వెళ్లే అనుమతి ఉంటుంది. ఉపవాస దీక్షలు చేస్తున్న ముస్లిం ఉద్యోగుల వెసులుబాటు కోసం ఈ ఉత్తర్వులు అమలు చేస్తున్నారు.