News April 8, 2025
బెటాలియన్‌కు ఎంపీ నిధులు రూ.20 లక్షలు మంజూరు

భద్రాద్రి జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం చాతకొండలో గల 6వ బెటాలియన్‌లో పలు అభివృద్ధి పనుల కోసం ఎంపీ వద్దిరాజు రవిచంద్ర తన ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి రూ.20 లక్షలు మంజూరు చేశారు. ఈ మేరకు నిధుల కేటాయింపు లేఖను మంగళవారం సంబంధిత అధికారులకు అందజేశారు. బెటాలియన్ కమాండెంట్ డి. శివప్రసాద్ రెడ్డి, ఆర్.ఐ జీవి రామారావులు గతంలో ఎంపీ రవిచంద్రను కలిసి బెటాలియన్‌కు నిధులు మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు.
Similar News
News February 23, 2026
NLG: లింగమంతుల గుట్ట జాతరకు సర్వం సిద్ధం

ప్రతి రెండేళ్లకోసారి వైభవంగా జరిగే నిడమనూరు (M) ఎర్రబెల్లి లింగమంతుల జాతరకు గుట్ట ముస్తాబైంది. అభివృద్ధి పనులు పూర్తికావడంతో లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు వస్తారని ఆలయ ఛైర్మన్ వెంకన్న, సర్పంచ్ మధు తెలిపారు. ఉపసర్పంచ్ నవీన్, గ్రామ పెద్దలు పాల్గొని ఏర్పాట్లను పర్యవేక్షించారు.
News February 23, 2026
ఆందోళన వద్దు.. ప్రశాంతంగా పరీక్ష రాయండి!

AP: నేటి నుంచి <<19213359>>ఇంటర్ పరీక్షలు<<>> ప్రారంభమవుతున్నాయి. ఈ కీలక సమయంలో విద్యార్థులు ఆందోళన చెందకుండా ప్రశాంతంగా ఉండటం ముఖ్యం. హాల్ టికెట్, పెన్నులు సిద్ధం చేసుకొని పరీక్షా కేంద్రానికి ముందుగానే చేరుకోండి. ప్రశ్నపత్రం చేతికి అందగానే పూర్తిగా చదవండి. తెలిసిన సమాధానాలను ఫస్ట్ రాసేయండి. నీట్‌గా ప్రజెంట్ చేస్తే ఎక్కువ మార్కులు సాధించొచ్చు. పరీక్షల సమయంలో సరైన నిద్ర, పౌష్టికాహారం చాలా అవసరం. All the Best.
News February 23, 2026
పంటల్లో ఎర్రనల్లిని ఎలా నివారించాలి?

ఎర్రనల్లి పురుగు వల్ల పంటలకు చాలా నష్టం జరుగుతుంది. ఎరుపు రంగు శరీరంతో ఈ పురుగులు ఆకుల అడుగు భాగాన గుంపులుగా పెరుగుతూ ఆకుల నుంచి రసాన్ని పీలుస్తాయి. దీని వల్ల ఆకులోని పత్రహరితం తగ్గిపోయి ఆకులపై తెలుపు, పసుపు మచ్చలు ఏర్పడతాయి. ఆకులు పాలిపోయి మొక్కలపై బూడిద చల్లినట్లు కళావిహీనంగా కనిపిస్తాయి. ఎర్రనల్లి నివారణకు లీటరు నీటికి డైకోఫాల్ 5ml లేదా అబామెక్టిన్ 0.5ml కలిపి పిచికారీ చేయాలి.


