News April 8, 2025
బెటాలియన్‌కు ఎంపీ నిధులు రూ.20 లక్షలు మంజూరు

భద్రాద్రి జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం చాతకొండలో గల 6వ బెటాలియన్‌లో పలు అభివృద్ధి పనుల కోసం ఎంపీ వద్దిరాజు రవిచంద్ర తన ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి రూ.20 లక్షలు మంజూరు చేశారు. ఈ మేరకు నిధుల కేటాయింపు లేఖను మంగళవారం సంబంధిత అధికారులకు అందజేశారు. బెటాలియన్ కమాండెంట్ డి. శివప్రసాద్ రెడ్డి, ఆర్.ఐ జీవి రామారావులు గతంలో ఎంపీ రవిచంద్రను కలిసి బెటాలియన్‌కు నిధులు మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు.
Similar News
News April 18, 2025
నరసాపురం: నేటి నుంచి తీరంలో అధికారులు సర్వే

చేపల వేటపై నిషేధం నేపథ్యంలో అర్హులైన మత్స్యకారులకు రూ.20 వేలు మత్స్యకార భృతి అందించేందుకు సర్వే చేపడుతున్నట్లు నరసాపురం మత్స్యశాఖ సహాయ డైరెక్టర్ ఎల్ఎన్ఎన్ రాజు తెలిపారు. ఈ నెల 18-23తేదీ వరకూ జిల్లాలోని తీర ప్రాంత మండలాల్లో ఒకేసారి సర్వే నిర్వహించనున్నారు. సిబ్బంది మత్స్యకారుల నుంచి బ్యాంకు ఖాతా, ఆధార్ నంబర్లు తదితర వివరాలను సేకరించనున్నారు.
News April 18, 2025
కేసీఆర్ సెంటిమెంట్.. WGL, KNR మధ్యలో BRS సభ

KCR సెంటిమెంట్ జిల్లాలైన KNR, WGL జిల్లాల మధ్యలో ఈనెల 27న BRS రజతోత్సవ సభ నిర్వహించనున్న విషయం తెలిసిందే. 20లక్షల మందితో 1500ఎకరాల్లో సభ ఏర్పాటు చేయనున్నారు. 50వేలకు పైగా వాహనాలు వస్తాయనే అంచనాతో 169ఎకరాలు సభకు, మిగతాదంతా(1,331) పార్కింగ్‌కు కేటాయించారు. 300 LED స్క్రీన్లు, 15లక్షల మజ్జిగ, 15లక్షల వాటర్ ప్యాకెట్లు, తాత్కాలిక ఆస్పత్రి, అంబులెన్సులు, 4 మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.