News March 23, 2025

బెట్టింగులకు పాల్పడితే కఠిన చర్యలు: తిరుపతి SP 

image

ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లు జరుగుతున్న నేపథ్యంలో ఎవరైనా బెట్టింగ్‌లకు పాల్పడితే అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజు హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా క్రికెట్ బెట్టింగ్ పాల్పడుతున్న వారిపై ప్రత్యేక నిఘా పెడుతున్నామన్నారు. గతంలో బెట్టింగులకు పాల్పడిన పాతనేరస్థుల వివరాలను సేకరిస్తున్నామని పేర్కొన్నారు. ఆన్ లైన్ ద్వారా బెట్టింగ్‌కు పాల్పడినా చర్యలు తప్పవన్నారు.

Similar News

News November 8, 2025

రాష్ట్రస్థాయికి ధారూర్ విద్యార్థి ఎంపిక

image

ఉమ్మడి RR జిల్లాలో నిర్వహించిన అండర్ 14 విభాగం క్రీడా పోటీల్లో ధారూర్ KGBV విద్యార్థిని అశ్విని అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. శుక్రవారం SR నగర్‌లోని క్రీడామైదానంలో 69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ పోటీలు నిర్వహించారు. ధారూర్ కేజీబీవీ పాఠశాలలో చదువుతున్న అశ్విని షాట్‌పుట్ విభాగంలో ద్వితీయ స్థానం సాధించి రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు ఎంపికైంది. దీంతో SO స్రవంతి, PET శ్రీలత విద్యార్థిని అభినందించారు.

News November 8, 2025

సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారంపై సమావేశం

image

సింగరేణి కార్మికుల పెండింగ్ సమస్యల విషయంలో INTUC సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ ఆధ్వర్యంలో HYDలోని ఆయన నివాసంలో శనివారం సమావేశం నిర్వహించారు. INTUC జాతీయ అధ్యక్షుడు డా.సంజీవరెడ్డి నాయకులతో కలిసి కార్మికుల హక్కులు- పరిరక్షణ, సంక్షేమం, భవిష్యత్తు వ్యూహాత్మక చర్యలు, యూనియన్ బలోపేతం గురించి చర్చించారు. నాయకులు త్యాగరాజన్, కాంపల్లి సమ్మయ్య, శంకర్ రావు, వికాస్ కుమార్ యాదవ్, సదానందం పాల్గొన్నారు.

News November 8, 2025

వరంగల్ బల్దియాలో దోచుకుంటున్నారు..!

image

గ్రేటర్ వరంగల్ నగర పాలక సంస్థలో కాంట్రాక్టర్లు, కొందరు అధికారులు ఒక్కటై రూ.కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారంటూ గ్రేటర్ డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. సాక్షాత్తు డిప్యూటీ మేయర్ స్వయంగా లేఖలో కొందరు ఇంజినీర్లు, కాంట్రాక్టర్లు మిలాఖత్ అయి ప్రజల సోమ్ముకు ఎసరు పెడుతున్నారంటూ, తక్షణమే విచారణ జరపాలని రిజ్వానా కోరారు.