News March 22, 2025
బెట్టింగ్‌కు పాల్పడితే కఠినమైన చర్యలు:ఎస్పీ

బెట్టింగ్ కార్యకలాపాలకు పాల్పడితే కఠినమైన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ కె.నారాయణ రెడ్డి పేర్కొన్నారు. శనివారం జిల్లా పోలీస్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాలో బెట్టింగ్, జూదం, ఇతర అక్రమ కార్యకలాపాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న కేసులను ప్రాధాన్యత తీసుకుని, త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
Similar News
News December 5, 2025
నిజామాబాద్: మండలాల వారీగా నామినేషన్ల వివరాలిలా..!

ఆలూరు 11 GPల్లో SP-22, WM-113, ARMR 14 GPల్లో SP -51, WM -146, బాల్కొండ 10GPల్లో SP- 29, WM-108, BMGL27 GPల్లో SP-67, WM-224, డొంకేశ్వర్13 GPల్లో SP-36, WM-98, కమ్మర్పల్లి 14GPల్లో SP-35, WM-104, మెండోరా 11GPల్లో SP-34, WM-130, మోర్తాడ్-10 GPల్లో SP-23, WM-117, ముప్కాల్ 7GPల్లో SP-32, WM-97, NDPT22 GPల్లో SP-65, WM-276, వేల్పూర్ 18GPల్లో SP-53, WM-179, ఏర్గట్ల 8GPల్లో SP-22, WM-63 నామినేషన్లు.
News December 5, 2025
ఖమ్మం: బాండ్ పేపర్‌పై గ్రామానికి వరాల జల్లు

కల్లూరు మండలం పేరువంచ గ్రామంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థి కొండపల్లి శ్రీనివాసరావు తనదైన శైలిలో బాండ్ పేపర్‌పై వరాల జల్లులు ప్రకటిస్తూ ప్రచారం చేస్తున్నారు. ఎంత ఖర్చైనా కోతుల సమస్య శాశ్వతంగా పరిష్కరిస్తానని, ఆడబిడ్డ పెళ్లికి రూ.25,116, పేదింటి గృహప్రవేశానికి రూ.10,116, పేద మహిళ కాన్పుకు రూ.10116, బీమా, విద్య, ఉత్సవాలకు, రైతులకు సాగునీటి పనులకు ఖర్చులు భరిస్తానని హామీ ఇచ్చారు.
News December 5, 2025
విజయనగరంలో డిగ్రీ విద్యార్థి సూసైడ్

విజయనగరం బీసీ హాస్టల్లో డిగ్రీ విద్యార్థిని సూసైడ్ చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. మహారాజ కాలేజీలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న స్వాతి బలవన్మరణానికి పాల్పడింది. ఆమెది శ్రీకాకుళం జిల్లా శ్రీకూర్మంగా పోలీసులు గుర్తించారు. తన డైరీలోని ఓ పేజీలో ‘అమ్మ.. నాన్నా నాకు బతకాలని లేదు. ఎందుకో భయమేస్తోంది. నేను ఏ తప్పు చేయలేదు’ అని స్వాతి రాసిన సూసైడ్ నోట్ బయటపడింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


