News March 22, 2025
బెట్టింగ్‌కు పాల్పడితే కఠినమైన చర్యలు:ఎస్పీ

బెట్టింగ్ కార్యకలాపాలకు పాల్పడితే కఠినమైన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ కె.నారాయణ రెడ్డి పేర్కొన్నారు. శనివారం జిల్లా పోలీస్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాలో బెట్టింగ్, జూదం, ఇతర అక్రమ కార్యకలాపాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న కేసులను ప్రాధాన్యత తీసుకుని, త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
Similar News
News July 11, 2025
JMKT: భాగ్యనగర్ ఎక్స్ ప్రెస్ రైలుకు అదనపు ఏసీ బోగీ

సికింద్రాబాద్ – సిర్పూర్ కాగజ్ నగర్ మధ్య నడిచే భాగ్యనగర్ ఎక్స్ ప్రెస్(12733 – 34) రైలుకు ఒక అదనపు ఏసీ బోగీ ఏర్పాటు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈనెల 13 నుంచి ఈ అదనపు బోగీ అందుబాటులోకి వస్తుందన్నారు. అదనపు ఏసీ బోగీ ఏర్పాటుతో సెలవుల్లో వివిధ దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు రిజర్వేషన్‌తో పాటు, సౌకర్యంగా ఉంటుందని రైల్వే అధికారులు తెలిపారు.
News July 11, 2025
శాఖాంబరీగా.. భద్రాకాళి దర్శనం

వరంగల్ ప్రసిద్ధ భద్రకాళి ఆలయంలో శుక్రవారం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. శాకంబరీగా అమ్మవారు భక్తులకు దర్శనం ఇచ్చారు. అర్చకులు అమ్మవారిని ఉదయాన్నే ప్రత్యేకంగా అలంకరించారు. అమ్మవారి దర్శనం కోసం ఆలయ ప్రాంగణంలో భక్తులు బారులు తీరారు. దర్శనం అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు.
News July 11, 2025
కరీంనగర్: ముఖ్య గమనిక.. రేపు స్క్రినింగ్ టెస్ట్

TG BC స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో సివిల్ సర్వీసెస్ ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఆన్‌లైన్ స్క్రీనింగ్ ఈ నెల 12న నిర్వహించనున్నారు. పరీక్ష మధ్యాహ్నం12 గం. నుంచి 2గం. వరకు వాగేశ్వరి ఇంజనీరింగ్ కాలేజ్‌లో జరుగుతుందని సర్కిల్ డైరెక్టర్ రవికుమార్ తెలిపారు. పరీక్షకు ఉమ్మడి KNR, MNCL జిల్లాల అభ్యర్థులు హాల్ టికెట్లను http://tgbcstudycircles.cgg.gov.in వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలన్నారు.