News March 25, 2025
బెట్టింగ్ జోలికెళ్లొద్దు: కర్నూలు SP

ఐపీఎల్ వేళ యువత బెట్టింగ్‌కు దూరంగా ఉండాలని కర్నూలు SP విక్రాంత్ పాటిల్ సూచించారు. ‘తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభమనే మాయలో పడకండి. అమాయక ప్రజలను మోసగించేందుకు ముఠాలు యాక్టివ్‌గా పనిచేస్తున్నాయి. చట్టవిరుద్ధమైన బెట్టింగ్‌తో కొందరు మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. జిల్లాలో ఎవరైనా బెట్టింగ్‌లకు పాల్పడితే 100/112కు సమాచారం ఇవ్వండి. వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం’ అని ఎస్పీ తెలిపారు.
Similar News
News March 29, 2025
తాగునీటి సమస్య లేకుండా తగిన చర్యలు తీసుకోవాలి: కలెక్టర్

జిల్లాలో తాగునీటి సమస్య లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని, అన్ని గ్రామాలు తిరిగి, తాగునీటి సమస్యలు ఉన్న చోట వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పీ.రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు. శనివారం తాగునీటి సమస్యల పరిష్కారం, ఉపాధి హామీ పనుల పురోగతిపై అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రెండు రోజుల్లో తాగునీటి సమస్య పరిష్కారంపై నివేదికను పంపించాలి అధికారులను ఆదేశించారు.
News March 29, 2025
వొకేషనల్ పరీక్షకు 117 మంది గైర్హాజరు: డీఈవో

పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో భాగంగా శనివారం జరిగిన వొకేషనల్ సబ్జెక్టులో 117 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాలేదని జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్ వెల్లడించారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా జరిగిన పరీక్షల్లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదని అన్నారు. పరీక్షలు పకడ్బందీగా, విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా నిర్వహించామన్నారు.
News March 29, 2025
ఊపిరి ఉన్నంత వరకు టీడీపీలోనే: కర్నూలు ఎంపీ

తన లాంటి సామాన్యుడిని ఎంపీని చేసిన ఘనత తెలుగుదేశం పార్టీదని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు తెలిపారు. శనివారం కర్నూలులో జరిగిన టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలో ఆయన పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ.. ఊపిరి ఉన్నంత వరకు తాను టీడీపీలోనే ఉంటానని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ ఆశయాలను కొనసాగిస్తూ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ పాలన సాగిస్తున్నారని చెప్పారు. టీడీపీ పేదల పార్టీ అని తెలిపారు.