News March 25, 2025

బెట్టింగ్‌ భూతానికి అనకాపల్లి జిల్లా యువకుడు బలి

image

క్రికెట్ బెట్టింగ్‌లో డబ్బులు పోగొట్టుకొని ఓ వ్యక్తి HYDలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మేడ్చల్ పోలీసుల సమాచారం ప్రకారం.. గుండ్ల పోచంపల్లిలో నివాసముంటున్న సోమేశ్(29) బెట్టింగ్‌లో రూ.2 లక్షలు పోగొట్టుకొని మనోవేదనకు గురయ్యాడు. మంగళవారం గౌడవెల్లి పరిధిలో రైలు పట్టాలపై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సోమేశ్ అనకాపల్లి జిల్లావాసిగా పోలీసులు గుర్తించారు. అతని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News December 2, 2025

పెళ్లికి వచ్చిన వారికి హెల్మెట్లు

image

రాజస్థాన్‌లో జరిగిన ఓ పెళ్లి వేడుకలో ఇచ్చిన రిటర్న్ గిఫ్టులు SMలో వైరల్ అయ్యాయి. అక్కడి కుచామన్ నగరంలో మనోజ్ బర్వాల్ అనే వ్యక్తి తన కూతురు సోనును యశ్ బెద్వాల్ అనే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశారు. వివాహానికి హాజరైన వారికి రిటర్న్ గిఫ్టులుగా హెల్మెట్లు ఇవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పిస్తూ 286 హెల్మెట్లను అందజేయడం పట్ల SMలో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

News December 2, 2025

HYD: రైల్వే ఫుడ్‌లో బొద్దింక.. ప్రయాణికుల ఆగ్రహం

image

నాగపూర్ నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వస్తున్న ఓ వ్యక్తి ఫుడ్ ఆర్డర్ చేశారు. రైల్వే ఫుడ్ ఓపెన్ చేసి తినే సమయంలో ఒక్కసారిగా దాంట్లో బొద్దింక కనబడటంతో షాక్ అయ్యాడు. వెంటనే రైల్వే అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఆహార నాణ్యతపై చర్యలు ఎక్కడ ఉన్నాయని ప్రశ్నించారు. దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని రైల్వే పోలీసులను డిమాండ్ చేశారు.