News April 1, 2025
బెట్టింగ్ యాప్‌ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: BHPL ఎస్పీ

బెట్టింగ్ యాప్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే మంగళవారం అన్నారు. యువత, విద్యార్థులు, అక్రమ బెట్టింగ్ యాప్స్, నిషేధిత ప్లే కార్డ్స్, గేమింగ్ యాప్‌లకు, ఐపీఎల్ బెట్టింగ్లకు దూరంగా ఉండాలని యువతకు సూచించారు. జిల్లా ప్రజలు, యువత అప్రమత్తంగా ఉండి బెట్టింగ్ సంబంధిత సమాచారాన్ని పోలీసులకు అందజేయాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని ఎస్పీ తెలిపారు.
Similar News
News April 6, 2025
ALERT: రేపు, ఎల్లుండి వర్షాలు

TG: ద్రోణి కారణంగా వచ్చే 2రోజుల పాటు రాష్ట్రంలో పలు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాల్లో రేపు.. వీటితో పాటు సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్‌లో ఎల్లుండి ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని అంచనా వేసింది.
News April 6, 2025
ముస్లింలకు బీఆర్ఎస్ అండగా ఉంటుంది: ఎమ్మెల్సీ కవిత

TG: వక్ఫ్ సవరణ బిల్లుతో ముస్లింలకు అన్యాయం జరిగిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆందోళన వ్యక్తం చేశారు. వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ‘కాంగ్రెస్ పార్టీ వైఫల్యం కారణంగానే బీజేపీ సర్కారు బిల్లును ఆమోదింపజేసుకుంది. ముస్లింలకు తీవ్ర నష్టం చేకూర్చే ఈ బిల్లును కేంద్రం ఉపసంహరించుకోవాలి. మైనారిటీల తరఫున మా పార్టీ పోరాడుతుంది. గతంలోనూ వారి అభివృద్ధి, సంక్షేమానికి మేం కృషి చేశాం’ అని గుర్తుచేశారు.
News April 6, 2025
సిద్దిపేట: యువ రైతు ఆత్మహత్య

మద్యానికి బానిసై యువ రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన తొగుట మండల కేంద్రంలో చోటు చేసుకుంది. వివరాలు.. మండల కేంద్రానికి చెందిన యువ రైతు మ్యాకల స్వామి(38) వ్యవసాయం చేస్తూ తన కుటుంబం జీవిస్తున్నాడు. స్వామికి గత 17 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. మద్యానికి బానిసై రోజు తాగి ఇంటికి వచ్చేవాడు. ఈ క్రమంలో శనివారం ఇంటికి వచ్చిన అతను బాత్రూంలోకి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు.