News March 17, 2025
బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేయను: హర్ష సాయి

ఇకపై బెట్టింగ్ యాప్స్‌ను తాను ప్రమోట్ చేయనని ప్రముఖ యూట్యూబర్ <<15777784>>హర్షసాయి<<>> అన్నారు. బెట్టింగ్ మూలాలపై అందరం కలిసి పోరాడదామని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇంతకుముందెన్నడూ తాను చట్టవిరుద్ధమైన బెట్టింగ్ యాప్స్‌కు ప్రచారం చేయలేదని తన సోషల్ మీడియా ఖాతాలో ఓ పోస్ట్ పెట్టారు. కాగా వీసీ సజ్జనార్ సూచనల మేరకు హర్షసాయిపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.
Similar News
News March 18, 2025
లండన్ వెళ్లిన చిరంజీవి.. రేపు అవార్డు స్వీకరణ

కళారంగంలో మెగాస్టార్ చిరంజీవి చేసిన కృషికి యూకే ప్రభుత్వం రేపు ఆయనను సన్మానించనుంది. ‘లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు’ను మెగాస్టార్‌కు యూకే పార్లమెంట్ ప్రదానం చేయనుంది. ఈ క్రమంలో ఆయన లండన్ చేరుకోగా అభిమానుల నుంచి ఘన స్వాగతం లభించింది. గత ఏడాది ఆయన్ను పద్మవిభూషణ్ అవార్డు, ఏఎన్ఆర్ జీవిత సాఫల్య పురస్కారం వరించిన సంగతి తెలిసిందే.
News March 18, 2025
మూడు రోజుల్లోనే టికెట్ డబ్బు వాపస్: రైల్వేశాఖ

వివిధ కారణాలతో రద్దయిన రైళ్లకు సంబంధించిన టికెట్ డబ్బులను ప్రయాణికులకు మూడు రోజుల్లోగా వాపసు చేయనున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే తెలిపింది. కౌంటర్లలో తీసుకున్న టికెట్‌ను 3 రోజుల్లోగా ఏ రైల్వేస్టేషన్లోనైనా ఇచ్చి నగదు తీసుకోవచ్చని తెలిపింది. ఇక IRCTC యాప్ ద్వారా బుక్ చేసుకున్న టికెట్లు వాటంతటవే రద్దయి డబ్బులు ప్యాసింజర్ ఖాతాకు రీఫండ్ అవుతాయని వెల్లడించింది.
News March 18, 2025
తుమ్మిడిహట్టి ఎత్తిపోతలపై కీలక ప్రకటన

TG: ఈ వేసవిలోనే తుమ్మిడిహట్టి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామని మంత్రి ఉత్తమ్ తెలిపారు. వచ్చే నెలలో సీఎం రేవంత్ మహారాష్ట్రలో పర్యటించి అక్కడి సీఎంతో చర్చలు జరుపుతారని వెల్లడించారు. తుమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లికి నీటిని ఎలా తీసుకురావాలనేదానిపై పరిశీలన జరుగుతోందన్నారు. కాళేశ్వరం పంప్ హౌసులను సరైన ఎత్తులో నిర్మించకపోవడంతో భారీ వరదలు వస్తే మునిగిపోతున్నాయని చెప్పారు.