News December 24, 2024
బెనిఫిట్ షోలపై వ్యాఖ్యల్ని ఖండించిన ఆళ్ల హరి
బెనిఫిట్ షోలపై బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు వ్యాఖ్యల్ని రాష్ట్ర చిరంజీవి యువత ప్రధాన కార్యదర్శి ఆళ్ళ హరి ఖండించారు. మంగళవారం గుంటూరులో వారు మాట్లాడుతూ.. తెలంగాణాలోని ఒక ధియేటర్‌లో జరిగిన దురదృష్టకర దుర్ఘటనను అడ్డం పెట్టుకొని కొంతమంది రాజకీయ నాయకులు సినీ పరిశ్రమ మొత్తంపై కత్తి కట్టడం దుర్మార్గమన్నారు. అధికారం అండతో సినీ జగత్తు ఆధిపత్యం చెలాయించాలని చూడటం తగదని అన్నారు.
Similar News
News January 20, 2025
వేమూరులో పురుగు మందు తాగి విద్యార్థిని మృతి
పురుగు మందు తాగి విద్యార్థిని మృతి చెందిన ఘటన వేమూరు అంబేడ్కర్ నగర్‌లో చోటుచేసుకుంది. అంబేడ్కర్ నగర్‌కు చెందిన బుస్సా రాము రెండవ కుమార్తె మేఘన ఇంటర్మీడియట్ సెకండియర్ చదువుతుంది. మేఘనకు తరచు కడుపునొప్పి రావడంతో ఇంట్లో ఉన్న పురుగు మందు తాగి బుధవారం ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. తల్లిదండ్రులు వైద్య చికిత్స కోసం తెనాలి వైద్యశాలకు తరలించగా ఆదివారం మృతి చెందినట్లు ఎస్ఐ రవి క్రిష్ణ తెలిపారు.
News January 20, 2025
గుంటూరులో నేటి నుంచి పశు వైద్య శిబిరాలు
ఈ నెల 20 నుంచి 31వ తేదీ వరకు పశు ఆరోగ్య శిబిరాలను నిర్వహిస్తున్నట్లు గుంటూరు జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి ఓ.నరసింహారావు వెల్లడించారు. ఈ మేరకు శిబిరానికి సంబంధించిన పోస్టర్లను కలెక్టర్ నాగలక్ష్మీ ఆవిష్కరించారని తెలిపారు. జాతీయ పశు వ్యాధి నియంత్రణ పథకం సౌజన్యంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని చెప్పారు. ప్రతీ మండలంలో రెండు బృందాలను ఏర్పాటు చేసి వైద్య సేవలు అందిస్తామని, సద్వినియోగం చేసుకోవాలన్నారు.
News January 19, 2025
గుంటూరు: బిడ్డతో సహా తల్లి సూసైడ్
విజయవాడ నుంచి చెన్నై వెళ్లే నేషనల్ హైవే సమీపంలో బుడంపాడు వద్ద రైల్వే ట్రాక్‌పై రైలు కిందపడి ఓ మహిళ తన బిడ్డతో ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం చోటు చేసుకుంది. మృతురాలు లైట్ గ్రీన్ కలర్ టాప్, వంకాయ రంగు ప్యాంటు గల పంజాబీ డ్రెస్ ధరించి ఉందని, పాప సిమెంటు రంగు టీ షర్టు ధరించి ఉన్నదని గుంటూరు GRP సబ్ ఇన్‌స్పెక్టర్ లక్ష్మీనారాయణరెడ్డి తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.