News January 27, 2025
బెల్లంకొండ: చేతబడి కలకలం.. భయాందోళనలో గ్రామస్థులు

బెల్లంకొండ మండలం వెంకటాయపాలెం గ్రామంలో ఎస్టీ కాలనీలో సుమారు 12 గృహాల ముందు ముగ్గు, నిమ్మకాయలు, ఎరుపు రంగు వస్త్రం, ఎండు మిరపకాయలతో కొన్ని వస్తువులను ఆదివారం రాత్రి సమయంలో పడేసి వెళ్లారు. సోమవారం ఉదయం గ్రామస్థులు వాటిని చూసి భయాందోళనకు గురవుతున్నారు. గ్రామంలో చేతబడి నిర్వహిస్తున్నారని పెద్ద ఎత్తున గ్రామస్థులు మాట్లాడుకుంటున్నారు. ఇళ్లను వదిలి ప్రజలు బయటికి రావటం లేదు.
Similar News
News February 18, 2025
చంద్రబాబు సర్కారు కుట్రలు చేస్తోంది: YCP

AP: వల్లభనేని వంశీ అరెస్టు లక్ష్యంగా చంద్రబాబు సర్కారు కుట్రలు చేస్తోందని వైసీపీ ఆరోపించింది. గన్నవరం కేసులో అన్నీ కట్టుకథలు, కల్పితాలు, తప్పుడు సాక్ష్యాలేనని.. కోర్టు లో సత్యవర్ధన్ స్టేట్‌మెంటే ఇందుకు నిదర్శనమని తెలిపింది. ఘటన జరిగిన సమయంలో తాను అక్కడ లేనని, ఎవరూ బలవంతం పెట్టలేదని ఆయన చెప్పారని పేర్కొంది.
News February 18, 2025
విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి: అడిషనల్ కలెక్టర్

విద్యార్థులకు విద్యతోపాటు ఆరోగ్యం కూడా చాలా ముఖ్యమని, విద్యార్థులకు న్యాయమైన భోజనం అందించాలని జిల్లా అడిషనల్ కలెక్టర్ రోహిత్ సింగ్ అన్నారు. స్టేషన్ ఘనపూర్ డివిజన్ కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను మంగళవారం ఆయన ఆకస్మిక తనిఖీ చేసి విద్యార్థులకు అందించే భోజనాన్ని పరిశీలించారు. కామన్ మెనూ పాటిస్తూ విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని ప్రిన్సిపల్ కృతమూర్తికి ఆయన సూచించారు.
News February 18, 2025
జగిత్యాల: ‘సంత్ సేవాలాల్ మహారాజ్ జీవితం సర్వమానవాళికి ఆదర్శం’

బంజారాల ఆరాధ్య దైవమైన సంత్ సేవాలాల్ మహారాజ్ జీవితం సర్వ మానవాళికి ఆదర్శమైనదని అడిషనల్ కలెక్టర్ బీఎస్ లత అన్నారు. జగిత్యాల బంజారా భవన్‌లో మంగళవారం జరిగిన సేవాలాల్ మహారాజ్ జయంతోత్సవ వేడుకల్లో ఆమె పాల్గొని మాట్లాడారు. సంతు సేవాలాల్ బంజారా జాతికే కాదు యావత్ ఇతర కులాలకు ఆదర్శ పురుషుడని కొనియాడారు. కార్యక్రమంలో జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి రాజ్ కుమార్, డీఈవో రాము తదితరులు పాల్గొన్నారు.