News February 19, 2025

బెల్లంపల్లిలో ఐటీ హబ్ ఏర్పాటు చేస్తాం: మంత్రి శ్రీధర్ బాబు

image

బెల్లంపల్లి నియోజకవర్గ కేంద్రంలో ఐటీ హబ్ ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు ఐటీశాఖ మంత్రి దుదిల్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆత్మీయ సమ్మేళనాన్ని పురస్కరించుకొని బెల్లంపల్లి పట్టణంలో ఎమ్మెల్యే గడ్డం వినోద్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. బెల్లంపల్లి విద్యాభివృద్ధి విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి కట్టుబడి ఉన్నారని ఆయన గుర్తుచేశారు.

Similar News

News December 13, 2025

నరసాపురంలో జాతీయ లోక్ అదాలత్ ప్రారంభం

image

నరసాపురం కోర్టు ప్రాంగణంలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌ను జిల్లా అదనపు న్యాయమూర్తి వాసంతి ప్రారంభించారు. ఈ సందర్భంగా కక్షిదారులను ఉద్దేశించి న్యాయమూర్తి మాట్లాడుతూ..కేసులు పరిష్కారంలో రాజీయే రాజమార్గమన్నారు. దీనివల్ల కక్షలు పెరగవని కోట్లు చుట్టూ చుట్టూ తిరిగి సమయాన్ని డబ్బును వృథా చేసుకోవలసిన అవసరం ఉండదు అన్నారు.

News December 13, 2025

అఖండ-2.. తొలిరోజు రూ.59.5 కోట్ల కలెక్షన్లు

image

బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన అఖండ-2 సినిమా బాక్సాఫీస్ వద్ద అదరగొట్టింది. ప్రీమియర్స్‌తో కలిపి తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.59.5 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించినట్లు మేకర్స్ వెల్లడించారు. బాలయ్య కెరీర్‌లో ఇవే బిగ్గెస్ట్ ఓపెనింగ్ కలెక్షన్లు అని తెలిపారు. నిన్న విడుదలైన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చిన విషయం తెలిసిందే. ఆది పినిశెట్టి, సంయుక్త, హర్షాలీ కీలక పాత్రలు పోషించారు.

News December 13, 2025

మంత్రి సంధ్యారాణిని కలిసిన మన్యం డీఈవో

image

పార్వతీపురం మన్యం జిల్లా డీఈవో‌గా బాధ్యతలు స్వీకరించిన పి.బ్రహ్మాజీరావు శనివారం మంత్రి సంధ్యారాణిని సాలూరు క్యాంపు కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. గతంలో జిల్లాలో పనిచేసిన అనుభవంతో జిల్లాను విద్యారంగంలో మరింత ప్రగతి సాధించేలా కృషి చేయాలని మంత్రి సంధ్యారాణి సూచించారు. వీరితో పాటు డిప్యూటీ డీఈవో రాజ్ కుమార్ మంత్రిని కలిశారు.