News February 8, 2025

బెల్లంపల్లిలో బీర్ సీసాలతో దాడి 

image

బెల్లంపల్లిలోని ఓ బార్‌లో బీర్ సీసాలతో దాడి చేసుకోవడం భయాందోళన సృష్టించింది. 2 టౌన్ SI మహేందర్ వివరాల ప్రకారం.. స్థానిక గొల్లగూడెంకు చెందిన సాగర్ స్నేహితులతో కలిసి కాల్ టెక్స్‌లోని బార్‌లో మద్యం తాగుతున్నారు. అదే బార్‌లో మద్యం తాగుతున్న తాండూర్‌కు చెందిన వంశీ మధ్య మాట మాట పెరిగి గొడవకు దారి తీసింది. సాగర్, అతని స్నేహితులు బీర్ సీసా పగలగొట్టి వంశీపై దాడి చేశారు. గొడవపై కేస్ నమోదైంది.

Similar News

News February 9, 2025

పార్వతీపురం మన్యం జిల్లాలో రిజర్వ్డ్ మద్యం షాపులకు 60 దరఖాస్తులు

image

పార్వతీపురం మన్యం జిల్లా వ్యాప్తంగా కల్లు గీత కార్మికులకు కేటాయించిన రిజర్వుడ్ మద్యం షాపులకు 60 దరఖాస్తులు వచ్చినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ సూపరింటెండెంట్ శ్రీనాథుడు తెలిపారు. మద్యం షాపులకు దరఖాస్తు చేసుకునేందుకు నేటితో గడువు ముగిసిందని పేర్కొన్నారు. ఈ నెల 10 తేదీ ఉదయం 9 గంటలకు పార్వతీపురం కలెక్టరేట్‌లో లాటరీ ద్వారా షాపులు కేటాయించనున్నట్లు వివరించారు.

News February 9, 2025

ఒంటరిగా ఉంటున్నారా?

image

దీర్ఘకాలిక ఒంటరితనం శారీరక, మానసిక సమస్యలకు దారితీస్తుందని, ఆరోగ్యంపై తీవ్రమైన ప్రతికూల ప్రభావాలను చూపుతుందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. ‘ఒంటరిగా ఉంటే.. మరణించే ప్రమాదం 29% పెరుగుతుంది. రోజుకు 15 సిగరెట్లు తాగడం కంటే ఎక్కువ ప్రమాదం. గుండె సంబంధిత వ్యాధులు, స్ట్రోక్, జ్ఞాపకశక్తి కోల్పోయే ప్రమాదం ఎక్కువ. రోగనిరోధక వ్యవస్థ బలహీనపడుతుంది. ఆందోళన పెరుగుతుంది’ అని అధ్యయనాలు చెబుతున్నాయి.

News February 9, 2025

పార్వతీపురం: జిల్లాలో 1,96,612 మంది చిన్నారులకు డి వార్మింగ్ కార్యక్రమం

image

పార్వతీపురం మన్యం జిల్లాలో 1,96,612 మంది చిన్నారులకు డి వార్మింగ్ కార్యక్రమం ఈనెల 10న చేపడుతున్నట్లు DM&HO డాక్టర్ భాస్కరరావు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 3845 అంగన్వాడీ కేంద్రాల్లో ఒకటి నుంచి ఐదేళ్లలోపు పిల్లలు 55,234 మంది, 5 నుంచి 19 ఏళ్ల వయస్సు గల 1,41,378 మంది పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. సిబ్బంది ప్రతి ఒక్కరికి మాత్రలు అందేలా చర్య చేపట్టాలని సూచించారు.

error: Content is protected !!