News February 8, 2025
బెల్లంపల్లిలో బీర్ సీసాలతో దాడి

బెల్లంపల్లిలోని ఓ బార్‌లో బీర్ సీసాలతో దాడి చేసుకోవడం భయాందోళన సృష్టించింది. 2 టౌన్ SI మహేందర్ వివరాల ప్రకారం.. స్థానిక గొల్లగూడెంకు చెందిన సాగర్ స్నేహితులతో కలిసి కాల్ టెక్స్‌లోని బార్‌లో మద్యం తాగుతున్నారు. అదే బార్‌లో మద్యం తాగుతున్న తాండూర్‌కు చెందిన వంశీ మధ్య మాట మాట పెరిగి గొడవకు దారి తీసింది. సాగర్, అతని స్నేహితులు బీర్ సీసా పగలగొట్టి వంశీపై దాడి చేశారు. గొడవపై కేస్ నమోదైంది.
Similar News
News March 27, 2025
వికారాబాద్ జిల్లా నేటి కార్యక్రమాలు

√ కొడంగల్: నేడు ఉచిత కంటి వైద్య శిబిరం.√ తాండూర్: నేడు ఎల్మకన్నె సహకార సంఘం సర్వసభ్య సమావేశం. కొడంగల్: నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం.√బొంరాస్ పేట: నేడు దుప్చర్లలో ఇసుక వేలంపాట. √ దోమ: నేడు దిర్సంపల్లి తైబజార్ వేలంపాట.√బొంరాస్ పేట: నేడు తుంకిమెట్ల తైబజార్ వేలంపాట.√ కొనసాగుతున్న రంజాన్ ఉపవాస దీక్షలు.√ కొనసాగుతున్న కొడంగల్ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.
News March 27, 2025
బ్రేక్‌ఫాస్ట్‌లో ఇవి తినండి

ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో పోషకాహారం తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఆరోగ్యాన్ని దెబ్బతీసే అల్పాహారం తీసుకోకూడదని హెచ్చరిస్తున్నారు. అధిక ప్రొటీన్ ఉండే చిరుధాన్యాలతో చేసిన ఆహార పదార్థాలు తినాలి. రాగి, సామలు, కొర్రలతో చేసిన ఇడ్లీలు, దోశలు తింటే లాభాలు ఉన్నాయి. ఇవి తింటే గ్యాస్ సమస్యలు తగ్గుతాయి. షుగర్, ఊబకాయం, రక్తహీనత, గుండె జబ్బుల నివారణకు ఇవి మంచి ఆహారం. అధిక ఆకలి సమస్యనూ అధిగమించవచ్చు.
News March 27, 2025
ప.గో జిల్లాలో టెన్షన్.. టెన్షన్

పశ్చిమగోదావరి జిల్లాలో మరికాసేపట్లో ఎంపీపీ, ఉపసర్పంచ్ పదవులకు ఉప ఎన్నిక జరగనుంది. అత్తిలి, యలమంచిలిలో వైసీపీకి పూర్తి మెజార్టీ ఉంది. ఓ ఐదారు మంది వైసీపీకి హ్యాండ్ ఇస్తే ఆ ఎంపీపీ పదవులు కూటమి ఖాతాలోకి వెళ్లిపోయే అవకాశం ఉంది. ఆ దిశగా కూటమి నాయకులు ప్లాన్ చేశారని సమాచారం. వైసీపీకి షాక్ ఇస్తారా? లేదా ఆ స్థానాలను వైసీపీనే నిలబెట్టుకుంటుందా? చూడాలి. మరోవైపు పోలీసులు 144 సెక్షన్ అమలు చేస్తున్నారు.