News April 14, 2025
బెల్లంపల్లిలో మహిళ అరెస్ట్

బెల్లంపల్లిలోని రైల్వే స్టేషన్ ముందు అక్రమంగా దేశీదారు విక్రయిస్తున్న మహిళను ఆదివారం అరెస్ట్ చేసినట్లు 2 టౌన్ ఎస్ఐ మహేందర్ తెలిపారు. ముందస్తు సమాచారం మేరకు రైల్వే స్టేషన్ ప్రాంతంలో తనిఖీలు చేపట్టగా కోట సారమ్మ వద్ద 9 లీటర్ల దేశీదారు మద్యం లభ్యమైందని పేర్కొన్నారు. మద్యాన్ని స్వాధీనం చేసుకొని ఆమెపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వెల్లడించారు.
Similar News
News October 29, 2025
రాబోయే 4 రోజులు కీలకం: మంత్రి సత్యకుమార్

మొంథా తుఫాన్ దృష్ట్యా రాబోయే నాలుగు రోజులు చాలా కీలకమని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సత్యకుమార్ సూచించారు. సీఎం చంద్రబాబు ఆర్టీజీఎస్లో సమీక్షిస్తూ, అధికారులకు తగిన ఆదేశాలిచ్చారన్నారు. రాష్ట్రంలోని 2,555 మంది గర్భిణులను ఆసుపత్రులకు తరలించి వైద్యం అందించడం ద్వారా పెద్ద విపత్తు నుంచి రాష్ట్రాన్ని కాపాడారని ఆయన తెలిపారు.
News October 29, 2025
వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి: కమిషనర్

తుఫాన్ ఎఫెక్ట్ నేపథ్యంలో భారీ వర్షాల దృష్ట్యా కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పరిస్థితులను గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ పరిశీలించారు. ఇంజినీరింగ్, శానిటేషన్ శాఖల అధికారులు, సిబ్బందికి కమిషనర్ పలు సూచనలు చేశారు. వర్షాల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు.
News October 29, 2025
సీజేఐపై దాడిని ఖండిస్తూ నవంబర్ 1న నిరసన: మందకృష్ణ

సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్పై జరిగిన దాడిని ఖండిస్తూ నవంబర్ 1వ తేదీన హైదరాబాదులో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తెలిపారు. బుధవారం జిల్లా కేంద్రంలో జరిగిన న్యాయవాదుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ దాడిని భారత రాజ్యాంగంపై జరిగిన దాడిగా పరిగణించాలని ఎమ్మార్పీఎస్ పిలుపునిస్తోందని, నిరసనను జయప్రదం చేయాలని కోరారు.


