News April 14, 2025
బెల్లంపల్లిలో మహిళ అరెస్ట్

బెల్లంపల్లిలోని రైల్వే స్టేషన్ ముందు అక్రమంగా దేశీదారు విక్రయిస్తున్న మహిళను ఆదివారం అరెస్ట్ చేసినట్లు 2 టౌన్ ఎస్ఐ మహేందర్ తెలిపారు. ముందస్తు సమాచారం మేరకు రైల్వే స్టేషన్ ప్రాంతంలో తనిఖీలు చేపట్టగా కోట సారమ్మ వద్ద 9 లీటర్ల దేశీదారు మద్యం లభ్యమైందని పేర్కొన్నారు. మద్యాన్ని స్వాధీనం చేసుకొని ఆమెపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వెల్లడించారు.
Similar News
News February 8, 2026
ఆందోల్: మంజీర నదిలో వృద్ధురాలి మృతదేహం కలకలం

ఆందోల్ నియోజకవర్గం పరిధిలోని చిట్కుల్ గ్రామ శివారులోని మంజీరా నదిలో సుమారు 65 ఏళ్లున్న ఓ వృద్ధురాలి మృతదేహం కలకలం రేపింది. చాముండేశ్వరి ఆలయ సమీపంలో ఈ మృతదేహాన్ని శనివారం సాయంత్రం నాలుగు గంటలకు స్థానికులు చూసి పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకొని సిబ్బంది డెడ్ బాడీని బయటకు తీశారు. పోస్టుమార్టానికి జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదైంది.
News February 8, 2026
జొన్నలు ఆహారంగా తీసుకుంటున్నారా?

జొన్నలను ఆహారంగా తీసుకుంటే శరీరానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయని వైద్యనిపుణులు చెబుతున్నారు. ఇవి శరీర బరువును తగ్గించడమే కాకుండా డయాబెటిస్‌ను నియంత్రణలో ఉంచుతాయని అంటున్నారు. అధిక ఫైబర్ వల్ల మలబద్ధకం తగ్గి, జీర్ణవ్యవస్థ తీరు మెరుగుపడుతుంది. అంతేకాకుండా కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. రొట్టె, అంబలి/జావ, కిచిడీ, దోశ/ఇడ్లీ రూపంలో వీటిని తీసుకోవచ్చు.
News February 8, 2026
విజయవాడలో నేడు నాన్ వెజ్ ధరలు ఇవే!

విజయవాడలో ఆదివారం నాన్ వెజ్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. చికెన్ స్కిన్ లెస్ కేజీ రూ. 280, స్కిన్ రూ. 270లుగా విక్రయిస్తున్నారు. డిమాండ్‌ను బట్టి కొన్ని ప్రాంతాల్లో స్వల్ప మార్పులు ఉన్నట్లు సమాచారం. మటన్ కేజీ రూ. 1000లగా ఉంది. చేపల్లో బొచ్చ కేజీ రూ. 220లు, 30 కోడిగుడ్లు గతవారం రూ. 165లు ఉండగా నేడు రూ. 153లకు చేరుకుంది. మరి మీ ప్రాంతంలో ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి


