News April 6, 2025
బెల్లంపల్లిలో 9మంది జూదరులు అరెస్టు

పేకాట ఆడుతున్న 9మందిని అరెస్టు చేసినట్లు 1టౌన్ SHOదేవయ్య తెలిపారు. పట్టణంలోని అశోక్ నగర్లో వెంకటేశ్కు చెందిన ఇంట్లో పేకాట ఆడుతున్నారనే సమాచారం మేరకు సిబ్బందితో కలిసి దాడి చేశామన్నారు. వెంకటేశ్, క్రాంతి కుమార్, రమేశ్, సురేశ్, మహేశ్, సుమన్, స్వామి, శ్రీనివాస్, మల్లాద్రిను అరెస్టు చేసి వారి వద్ద రూ.12,500, 7ఫోన్లు, 5బైక్లు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు SHO వెల్లడించారు.
Similar News
News October 28, 2025
మార్చి మూడో వారం నుంచి టెన్త్ ఎగ్జామ్స్?

TG: పదో తరగతి పరీక్షలను మార్చి మూడో వారం నుంచి నిర్వహించాలని విద్యాశాఖ భావిస్తున్నట్లు సమాచారం. 16 లేదా 18వ తేదీ నుంచి ఎగ్జామ్స్ ప్రారంభమయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. కాగా ఇంటర్ పరీక్షలు ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు నిర్వహిస్తామని ఇటీవల అధికారులు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏటా ఇంటర్ పరీక్షలు ముగిసే రెండు రోజుల ముందు టెన్త్ ఎగ్జామ్స్ మొదలవడం ఆనవాయితీగా వస్తోంది.
News October 28, 2025
ఉదయాన్నే టీ, కాఫీ తాగుతున్నారా?

ఉదయం లేవగానే కాఫీ, టీ తాగితేనే కానీ చాలామంది కాలకృత్యాలు పూర్తి చేయలేరు. అయితే ఇదెంతమాత్రం మంచిది కాదంటున్నారు గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డా.సుశీల్ శర్మ. ‘టీ, కాఫీలు ముందు పెద్దపేగును కదిలిస్తాయి. తరువాత అదే అలవాటుగా మారి చివరకు పేగుల సహజ రిథమ్ను దెబ్బతీస్తాయి. ఆపై పొట్టలో ఇరిటేట్ చేస్తాయి. ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతాయి’ అని పేర్కొన్నారు. వాటి బదులు గోరువెచ్చని నీటిని సేవించాలని సూచించారు.
News October 28, 2025
అడుగున ఎరువుకొద్దీ పైన బంగారం

ఏ పొలానికైనా ఎరువులే బలం అని చెప్పేందుకు ఈ సామెతను ఉపయోగిస్తారు. పొలం పనులలో భూమికి ఎరువు వేయడం కష్టమైనా, సరైన ఎరువు ఫలితంగా బంగారంలాంటి పంట పండి మనకు సంతోషం కలుగుతుంది. అలాగే, కష్టపడి పనిచేస్తేనే మంచి ఫలితాలు వస్తాయని ఈ సామెత చెబుతుంది.


