News April 6, 2025

బెల్లంపల్లిలో 9మంది జూదరులు అరెస్టు

image

పేకాట ఆడుతున్న 9మందిని అరెస్టు చేసినట్లు 1టౌన్ SHOదేవయ్య తెలిపారు. పట్టణంలోని అశోక్ నగర్‌లో వెంకటేశ్‌కు చెందిన ఇంట్లో పేకాట ఆడుతున్నారనే సమాచారం మేరకు సిబ్బందితో కలిసి దాడి చేశామన్నారు. వెంకటేశ్, క్రాంతి కుమార్, రమేశ్, సురేశ్, మహేశ్, సుమన్, స్వామి, శ్రీనివాస్, మల్లాద్రిను అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.12,500, 7ఫోన్లు, 5బైక్‌లు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు SHO వెల్లడించారు.

Similar News

News December 4, 2025

ఈ బౌలింగ్‌, ఫీల్డింగ్‌తో వరల్డ్ కప్ నెగ్గగలమా?

image

వన్డే వరల్డ్ కప్ గెలవాలంటే జట్టు అన్ని విభాగాల్లో టాప్ క్లాస్‌లో ఉండాలి. ప్రస్తుతం IND బౌలింగ్, ఫీల్డింగ్‌ చూస్తే WC గెలవడం కష్టమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. SAతో 2వ వన్డేలో 350+స్కోర్ చేసినా బౌలర్లు పోరాడలేదు. తొలి వన్డేలోనూ తేలిపోయారు. ఫీల్డింగ్‌లోనూ లోపాలు కనిపించాయి. WC-2027కు ముందు భారత్ 20 వన్డేలే ఆడనుంది. అప్పట్లోగా ఈ 2 విభాగాల్లో మెరుగవ్వకుంటే WC మరోసారి కలగానే మిగిలే ప్రమాదం ఉంది.

News December 4, 2025

సికింద్రాబాద్‌ దూరం.. కొత్త జోన్ కోరుతున్న జనం!

image

సికింద్రాబాద్‌ జోన్ పరిధిలోకి బోడుప్పల్, జవహర్‌నగర్, నాగారం, తూంకుంట విలీనమైన విషయం తెలిసిందే. శివారు ప్రాంతాలకు సికింద్రాబాద్‌ జోన్ కార్యాలయం దగ్గరగా లేకపోవడంతో, ప్రజలకు అవసరమైన సేవలు పొందడం సవాలుగా మారిందన్న చర్చలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విలీనమైన 4 పుర, నగర పాలక సంస్థల్లో ఏదో ఒకదాన్ని కొత్త జోన్‌గా ప్రకటించాలన్న డిమాండ్లు జోరందుకున్నాయి. మరి కొత్త జోన్ ఏర్పాటుపై మీ కామెంట్?