News February 9, 2025

బెల్లంపల్లి: అంకుశం వైపు పులి కదలికలు

image

గత 11రోజులుగా బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామపంచాయతీ బుగ్గగూడెం అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న పెద్దపులి అడుగులను ఆదివారం ఉదయం బుగ్గ శివాలయం ఆలయం ప్రాంతంలో గుర్తించినట్లు అటవీశాఖాధికారి పూర్ణచందర్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ..బుగ్గ ఆలయం గుట్ట నుంచి అంకుశం గ్రామం వైపు పులి వెళ్లినట్లుగా ఆనవాళ్లు కనుక్కున్నామన్నారు. రెండు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండి తగు జాగ్రత్తలు వహించాలని సూచించారు.

Similar News

News December 4, 2025

సహజ ప్రసవాలు పెంచేందుకు ప్రత్యేక శిక్షణ

image

AP: సహజ ప్రసవాలు పెంచేందుకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలకు సిద్ధమైంది. ప్రభుత్వాసుపత్రుల్లో పనిచేసే గైనకాలజిస్టులకు ‘అసిస్టెడ్ వెజైనల్ డెలివరీ’ విధానంపై శిక్షణ ఇవ్వనున్నట్లు ఆ శాఖ కమిషనర్ వీరపాండియన్ తెలిపారు. వాక్యూం ఎక్ట్ర్సాక్షన్, ఫోర్సెప్స్‌‌తో సహజ ప్రసవాలు ఎలా చేయవచ్చో వివరిస్తామన్నారు. ఈ నెల 10 నుంచి 6 నెలల పాటు నిర్దేశించిన తేదీల్లో కార్యక్రమాలు జరుగుతాయని చెప్పారు.

News December 4, 2025

నేడు పఠించాల్సిన మంత్రాలు

image

1. అష్టైశ్వర్యాల కోసం: ‘‘ఓం మహాలక్ష్మీ చ విద్మహే విష్ణుపత్నీ చ ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్’’, ‘‘ఓం శ్రీ హ్రీం శ్రీ కమలే కమలాలయే ప్రసీదః’’, ‘‘శ్రీ హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మమాయై నమః’’
2. దత్తాత్రేయుని అనుగ్రహం కోసం: ‘‘ఓం దత్తాత్రేయ విద్మహే దిగంబరాయ ధీమహీ తన్నో దత్తాః ప్రోచోదయాత్’’
3. చంద్ర దోషం తగ్గిపోవడానికి: ‘‘ఓం సోమాయ నమః, ఓం ఐం క్లీం సౌమాయ నమః, ఓం శీతాంశు, విభాంశు అమృతాంశు నమః’’

News December 4, 2025

తూ.గో. హ్యాండ్‌ బాల్ టీమ్ ఎంపిక

image

సామర్లకోట మండలం పనసపాడులో బుధవారం తూర్పుగోదావరి జిల్లా హ్యాండ్‌బాల్ టీమ్ ఎంపిక జరిగింది. ఈ ఎంపిక ప్రక్రియలో 40 మంది క్రీడాకారులు పాల్గొనగా.. 16 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసినట్లు జిల్లా అధ్యక్షులు దుర్గాప్రసాద్ తెలిపారు. ఎంపికైన ఈ జట్టు కర్నూలులో జరగనున్న అంతర్ జిల్లాల రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటుందని ఆయన వెల్లడించారు. ఎంపికైన క్రీడాకారులకు ఇతర క్రీడాకారులు అభినందనలు తెలిపారు.