News February 9, 2025
బెల్లంపల్లి: అంకుశం వైపు పులి కదలికలు

గత 11రోజులుగా బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామపంచాయతీ బుగ్గగూడెం అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న పెద్దపులి అడుగులను ఆదివారం ఉదయం బుగ్గ శివాలయం ఆలయం ప్రాంతంలో గుర్తించినట్లు అటవీశాఖాధికారి పూర్ణచందర్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ..బుగ్గ ఆలయం గుట్ట నుంచి అంకుశం గ్రామం వైపు పులి వెళ్లినట్లుగా ఆనవాళ్లు కనుక్కున్నామన్నారు. రెండు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండి తగు జాగ్రత్తలు వహించాలని సూచించారు.
Similar News
News February 13, 2026
ప్రశ్నించడాన్ని CBN తట్టుకోలేకపోతున్నారు: జగన్

AP: తిరుమల లడ్డూ వ్యవహారంపై ప్రశ్నించడాన్ని CM CBN తట్టుకోలేకపోతున్నారని YCP అధినేత జగన్ అన్నారు. అందుకే తమ పార్టీ నేతలపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. YCP MLAలు, MLCలతో ఆయన భేటీ అయ్యారు. ‘అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షంగా గుర్తింపు ఇవ్వడం లేదు. బలం తక్కువ కావడంతో అక్కడ గొంతెత్తలేం. అందుకే మీడియాతో మాట్లాడుతున్నాం. మండలిలో బలం ఉంది కాబట్టి అవగాహనతో బాగా మాట్లాడాలి’ అని దిశానిర్దేశం చేశారు.
News February 13, 2026
NTR: విద్యార్థులకు అలర్ట్.. పరీక్షల ఫలితాలు విడుదల

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(ANU) పరిధిలో NOV 2025లో నిర్వహించిన మాస్టర్ ఆఫ్ వొకేషన్ 3వ సెమిస్టర్, AUG 2025లో నిర్వహించిన డిప్లొమా ఇన్ మ్యూజిక్(వోకల్) రెగ్యులర్ పరీక్షలు ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. ఈ పరీక్షలు రాసిన విద్యార్థులు ANU అధికారిక వెబ్‌సైట్ https://nagarjunauniversity.ac.in/examcell/results ద్వారా ఫలితాలు చెక్ చేసుకోవచ్చని వర్సిటీ పరీక్షల విభాగం అధికారులు తెలిపారు.
News February 13, 2026
గచ్చిబౌలిలో నోట్ల కట్టలతో పారిపోయాడు!

గచ్చిబౌలిలో పట్టపగలే నగదు చోరీ జరిగింది. గోపన్‌పల్లిలో యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలో నగదు నింపేందుకు వచ్చిన సీఎంఎస్ వాహన డ్రైవర్ అజిత్ అలియాస్ శివ రూ.57 లక్షల నగదుతో పరారీ అయ్యాడు. కస్టోడియన్లు బ్యాంక్‌లో ఉండగా సెక్యూరిటీ గార్డు బయటకు వెళ్లిన సమయం చూసి చోరీ చేశాడు. వాహనాన్ని తెల్లాపూర్ వద్ద వదిలేసి నగదుతో నిందితుడు పారిపోయాడు. కేసు నమోదు చేసి ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు.


