News February 1, 2025
బెల్లంపల్లి: అడవి పందిని హతమార్చిన పెద్దపులి

2 రోజులుగా బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామం బుగ్గ దేవాలయం అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచారం మండల ప్రజలను హడలెత్తిస్తోంది. బుగ్గకు వెళ్లే రహదారి పక్కన తోకల మల్లేశ్కు చెందిన పత్తి చేనులో అడవి పందిపై పెద్దపులి దాడి చేసినట్లు గ్రామస్థులు తెలిపారు. పెద్దపులి దాడి విషయాన్ని అటవీశాఖ అధికారులు ధ్రువీకరించారు.
Similar News
News December 10, 2025
అవినీతి రహిత సమాజమే లక్ష్యం: కలెక్టర్ పమేలా సత్పతి

అంతర్జాతీయ అవినీతి నిరోధక దినోత్సవం సందర్భంగా మంగళవారం కరీంనగర్ కలెక్టరేట్లో అవినీతి నిరోధక శాఖ ఆధ్వర్యంలో ప్రతిజ్ఞా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అవినీతి వ్యతిరేక దినోత్సవ పోస్టర్ను ఆవిష్కరించారు. అవినీతి రహిత సమాజం మనందరి లక్ష్యం కావాలని ఆమె పేర్కొన్నారు.
News December 10, 2025
విశాఖ: DRO, RDOల నియామకంలో మీనమేషాలు

విశాఖలో రెగ్యులర్ అధికారులను నియమించడంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. DRO, RDOల మధ్య వివాదం జరగ్గా.. ఇద్దరినీ సరెండర్ చేశారు. 2 నెలలు కావొస్తున్నా ఇప్పటి వరకు రెగ్యులర్ అధికారులను నియమించలేదు. ఇన్ఛార్జ్ హోదాల్లో ఉన్నవారు పెద్ద పెద్ద పనుల విషయంలో తలదూర్చడం లేదు. తాత్కాలికమైన పనులనే చూసుకొని వెళ్లిపోతున్నారు. దీంతో కీలక నిర్ణయాల విషయంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
News December 10, 2025
తిరుపతి ఐజర్లో ఉద్యోగావకాశం

ఏర్పేడు వద్ద ఉన్న తిరుపతి ఐజర్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికగా లేబరోటరీ అసిస్టెంట్-1 పోస్టుకు 13వ తేదీ వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు కార్యాలయం పేర్కొంది. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సైన్స్/ డిప్లమా ఇన్ M.L.T పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు. ఇతర వివరాలకు www.iisertirupati.ac.in/jobs/advt_762025/ వెబ్ సైట్ చూడాలి.


