News February 5, 2025

బెల్లంపల్లి: అనాథ యువకుడికి అంత్యక్రియలు

image

బెల్లంపల్లిలో ఓ అనాథ యువకుడికి గ్రామస్థులంతా కలిసి అంత్యక్రియలు చేశారు. గ్రామానికి చెందిన కూలీ నరేశ్ బుధవారం రైల్వే పట్టాలపై అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అతడికి ఎవరూ లేకపోవడంతో గ్రామస్థులంతా కలిసి డబ్బులు పోగు చేసి అంత్యక్రియలు నిర్వహించారు.

Similar News

News November 29, 2025

మావోయిస్ట్ కీలక నేత అనంత్ అస్త్ర సన్యాసం

image

మావోయిస్టు పార్టీ కీలక నేతల లొంగుబాటు పర్వం కొనసాగుతోంది. తాజాగా మహారాష్ట్ర – మధ్యప్రదేశ్ – ఛత్తీస్‌గఢ్ స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి అనంత్ అలియాస్ వికాస్ మహారాష్ట్ర పోలీసుల ఎదుట లొంగిపోయారు. మొత్తం 15 మంది నక్సల్స్ అస్త్ర సన్యాసం తీసుకున్నారు. వీరిలో ఐదుగురు మహిళలు ఉన్నారు. జనవరి 1న సాయుధ విరమణ చేస్తున్నట్టు నిన్న లేఖ విడుదల చేసిన అనంత్ అంతలోనే లొంగిపోవడం గమనార్హం.

News November 29, 2025

జగిత్యాల: ‘ఉద్యోగులకు టీఎన్జీవో అండగా ఉంటుంది’

image

రాష్ట్రంలోని ఉద్యోగులకు టీఎన్జీవో సంఘం అండగా ఉంటుందని జిల్లా అధ్యక్షులు నాగేందర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం మెట్‌పల్లి యూనిట్ శాఖ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉద్యోగుల ప్రధాన సమస్యలైన సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం (ఓపీఎస్) అమలు చేయడం, పెండింగ్ బిల్లుల చెల్లింపు, ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ (ఈహెచ్ఎస్) అంశాలపై సంఘంలో చర్చించారు.

News November 29, 2025

రాజన్న సిరిసిల్ల జిల్లాలో 68,468 క్వింటాళ్ల పత్తి కొనుగోలు

image

జిల్లాలో ఇప్పటివరకు 68,468 క్వింటాళ్ల పత్తి కొనుగోలు పూర్తయింది. వేములవాడ, కోనరావుపేట మండలాల్లోని 3 కొనుగోలు కేంద్రాల్లో 2889 మంది రైతుల వద్ద 48,958 క్వింటాళ్ల పత్తి, ఇల్లంతకుంట మండలంలోని రెండు కొనుగోలు కేంద్రాల్లో 1242 మంది రైతుల వద్ద 19,510 క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేసినట్లు సీసీఐ అధికారులు తెలిపారు. మొత్తం 4132 మంది రైతుల నుండి 68,468 క్వింటాళ్ల కొనుగోలు పూర్తయినట్లు అధికారులు తెలిపారు.